Sye Raa Narasimhareddy Completes 100 Days శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ ’సైరా‘

Megastar chiranjeevi sye raa narasimhareddy completes 100 days

Chiranjeevi, Amitabh bachchan, jagapathi babu, kiccha sudeep, nayantara, tamannah, sye raa box office, sye raa collections, Sye Raa Narasimha Reddy, Sye Raa 100 days, tollywoodtollywood, movies, entertainment

Megastar Chiranjeevi's historical magnum opus Sye Raa Narasimhareddy completed its 100 days run successfully on January 9, 2020. The film ran 100 days directly at Emmiganore. This patriotic films was released on October 2 in connection with Mahatma Gandhi's 150th birth anniversary.

శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ ’సైరా‘

Posted: 01/09/2020 09:26 PM IST
Megastar chiranjeevi sye raa narasimhareddy completes 100 days

ధర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రూపోందిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం ఇవాళ్టితో వంద రోజులు పూర్తి చేసుకుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో.. నయనతార, తమన్నా ప్రధాన హీరోయిన్స్ గా నటించారు. కాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు.

రాయలసీమకు చెందిన మొదటి తరం స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఐదు ప్రధాన బాషలలో విడుదల కావడం జరిగింది. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ క్యాస్ట్ తో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సైరా మూవీ తెరకెక్కింది. దర్శకుడు సురేంధర్ రెడ్డి రెండేళ్లు కష్టపడి విజువల్ వండర్ గా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. ఉద్యమ వీరుడిగా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి విజృభించారు. తాజాగా ఈ సినిమా ఎమ్మిగనూరులో నేరుగా 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.

2019 గాను టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్సింగ్ సాధించిన చిత్రంగా సైరా నరసింహారెడ్డి నిలిచింది. అయితే ఎన్ని కేంద్రాలలో శతజయంతోత్సవం జరుపుకుందన్న వివరాలు తెలియాల్సి వుంది. విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 105.83 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టగా.. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా 140.73 కోట్లను ఆర్జించింది. అయితే ఆ తరువాత ఈ చిత్రానికి పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. చిరంజీవి రీఎంట్రీ తరువాత కూడా తన అభిమానులు అధికంగా వున్న నైజాంపై ఆయన పట్టు తగ్గలేదని ఈ చిత్రానికి 20 రోజల్లో 32 కోట్ల షేర్ వసూళ్లు కావడమే స్పష్టం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles