శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ నుంచి క్రితం రోజునే హీరో శర్వానంద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. 24గంటలు కూడా తిరగకుండానే చిత్రానికి సంబంధించిన టీజర్ కట్ చేసి నెట్టింట్లో పోస్టు చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ గా తీస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులలో సర్వాత్రా అసక్తి నెలకొంది.
‘షరతులు, నియమాలు, హద్దులు లేని ప్రేమకు అసలైన నివాళి’ అంటూ నిన్నటి రోజున శర్వానంద్ ఏడారిలో ఒంటెలను లాగుతున్న ఫస్ట్ లుక్ ను పంచుకున్న చిత్ర బృందం.. తాజాగా టీజర్ ను రిలీజ్ చేసి యువతను అకట్టుకుంది. విద్యార్థి దశలో ఏర్పడిన ప్రేమకథ.. యుక్తవయస్సుకు వచ్చిన తరువాత ఎలా మారింది.. విడిపోయిన ప్రేమికులను కలిపే తరుణంలో ఆ మాటలకున్న బలం.. వాటి వెనుక దాగిన భావోద్వేగం.. టీజర్ లో ప్రమికులను, యవతను ఒక చక్కని ఫీల్ ను తీసుకువస్తొంది.
తమిళంలో చిత్రాన్ని రూపోంది.. ప్రేక్షకుల మన్ననలను పోందిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించారు. టీజర్‌లో జానకిగా సమంత, రామ్‌గా శర్వానంద్ నటన ఆకట్టుకుంటోంది. ‘చాలా దూరం వెళ్లిపోయావా రామ్..’ అని భావోద్వేగానికి లోనైన సమంత.. శర్వానంద్‌ను అడగగా.. ‘నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను’ అని చెప్పే డైలాగులతో టీజర్ ఉంది. టీజర్‌లో ఉన్న సన్నివేశాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. అనివార్య కారణాల వల్ల విడిపోయిన ఇద్దరు కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్ రీయూనియన్లో కలిసిన సమయంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమకు కొత్త నిర్వచనాన్ని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more