యాసిడ్ దాడి బాధితురాలి పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ‘ఛపాక్’ చిత్ర బృందం సరికొత్త ప్రయోగం చేసింది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె టైటిల్ రోల్ పోషించిన సినిమా ఇది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. యాసిడ్దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం దీపిక యాసిడ్ బాధితురాలి లుక్‌లో నటించారు. అంతేకాదు ఈ చిత్రం షూటింగ్ దిల్లీ వీధుల్లో జరుగుతున్నా.. ఎవరూ దీపికను గుర్తుపట్టలేదు.
కాగా యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో చూపించేందుకు ‘ఛపాక్’ టీం సూపర్ మార్కెట్, దుస్తులు, ఫ్యాన్సీ దుకాణాల్లో రహస్యంగా కెమెరాలు ఉంచింది. దీపిక ‘మాలతి’ (సినిమాలోని పాత్ర పేరు) గెటప్‌లో తయారై కొంత మంది యాసిడ్ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. దుకాణాల్లో వీరిని చూసి కొందరు చిరాకు, విసుగు తెచ్చుకున్నారు. మరికొందరు స్నేహంగా పలకరించారు. బాధితుల పట్ల సమాజం తీరు మారాలనే సందేశం ఇస్తూ ఈ వీడియోను రూపొందించారు. సాధారణంగా దీపిక ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆమె చుట్టూ భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడుతుంటారు. అలాంటి ఆమెకు ఇది ఓ కొత్త అనుభవం అని చెప్పొచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more