అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టీజర్ వచ్చేసింది. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె లైట్ కథానాయికలు. గోపీ సుందర్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వరుసగా నాలుగు పోస్టర్లను విడుదల చేసినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. రాశీ, ఐశ్వర్య, కేథరిన్, ఇజబెల్లె.. ఈ నలుగురు విజయ్ సరసన కనిపించడం దీనికి కారణం. దీంతో ఈ సినిమా కథపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
‘ప్రేమంటే రాజీ గౌతమ్.. ప్రేమంటే త్యాగం.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావు..’ అని ఓ అమ్మాయి అంటున్న డైలాగ్తో టీజర్ ఆరంభమైంది. విజయ్ నలుగురు కథానాయికలతోనూ అన్యోన్యంగా ఉంటూ కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో మరో ‘అర్జున్ రెడ్డి’ గుర్తొచ్చాడు. టీజర్లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more