Allu Arha's 'Dosa' step leaves Bunny in splits! ‘రాములో రాములా’ పాటపై బన్ని వేసిన స్టెప్పేంటీ..!

Allu arjun s daughter arha does the famous dosa step from ala vaikuntapurramloo

#AlaVaikunthapurramuloo, Allu Arjun, Allu Arha, Allu Arjun Daugher, Allu Arha, Ala Vaikuntapurramloo, Ramuloo Ramula song, Half Coat step, dosa step, Allu Arjun, Pooja Hegde, Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Samuthirakani, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul Ramakrishna, Harsha Vardhan, Trivikram, Thaman S, Tollywood, movies, entertainment

Stylish Star Allu Arjun's new movie Ala Vaikunthapurramuloo is gearing up for release on Jan 12th, Recently, a video of Allu Arjun's conversation with his dear daughter Arha surfaced on the Internet and the netizens can't get over the cuteness.

‘రాములో రాములా’ పాటపై బన్ని వేసిన స్టెప్పేంటి..!

Posted: 01/03/2020 08:05 PM IST
Allu arjun s daughter arha does the famous dosa step from ala vaikuntapurramloo

అభిమానులు ఆయన్ను స్టైలిష్‌ స్టార్‌ అంటారు. ఆయన స్టెప్పులు వేస్తే వెండితెర షేక్‌ అవ్వాల్సిందే. ఇలా తన స్టైల్‌, డ్యాన్స్‌తో కోట్లాది మంది ఆదరణ పొందిన కథానాయకుడు అల్లు అర్జున్‌. అయితే అల్లు అర్జున్‌ వేసింది దోశ స్టెప్పని ఆయన ముద్దుల కుమార్తె అర్హ చెబుతోంది. ముద్దులొలికే మాటలతో తండ్రి వద్ద గారాలుపోతూ చెప్పిన మాటలు నెట్టింట్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఎంతలా అంటే ఈ వీడియోను నెట్టింట్లో ఇలా పోస్ట్ చేయగానే ఏకంగా ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు.

అల్లు అర్హ క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడుతున్న వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘దోశ స్టెప్‌’ అని పగలబడి నవ్వుతున్న ఎమోజీనీ షేర్‌ చేశారు. ఇందులో బన్నీ కుమార్తెతో మాట్లాడుతూ కనిపించారు. ‘నాన్న సినిమా పేరేంటి?’ అని అడిగితే.. ‘అల వైకుంఠపురములో..’ అని, ‘అందులో నాన్న ఎల్లో కలర్‌ జాకెట్‌ వేసుకుని సాంగ్‌ చేస్తా కదా.. అది ఏ సాంగ్‌?’ అంటే ‘రాములో రాములో..’ అని పాప జవాబిచ్చింది.

అందులో ఏ స్టెప్పు వేశానని అడిగితే.. ‘దోశ స్టెప్‌ అంటూ..’ రెండు చేతులూ తిప్పుతూ డ్యాన్స్‌ చేసింది. ఈ చూడచక్కని వీడియోకు తెగ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. బన్నీ ముద్దుపెట్టుకుంటున్న ఎమోజీని షేర్‌ చేశారు. ‘బుగ్గల బంగారు’ అని కల్యాణ్‌ దేవ్‌ కామెంట్‌ చేశారు. ‘హాహాహా.. టూ క్యూట్‌. దోశ స్టెప్‌’ అని సుశాంత్‌ పేర్కొన్నారు. మరెందుకు ఆలస్యం ఆ బుజ్జి బుజ్జి మాటలను.. చిన్నారి క్యూట్ గా కూర్చోని వేసిన స్టెప్పులను మీరూ వీక్షించండి..

 
 
 
View this post on Instagram

Dosa step #alavaikunthapurramuloo @alluarjunonline

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh