తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ప్రముఖ రచయత నటుడు గొల్లపూడి మారుతిరావు మరణంతో విషాదంలో మునిగిన టాలీవుడ్ వారం తిరగకుండానే మరో స్టార్ కమేడియన్ అలీ ఇంట్లో విషాదం సంభవించింది. ఆయనకు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి జైతును బీబీ ఇవాళ తుదిశ్వాస విడిచింది. తీవ్ర అనారోగ్యంతో పాటు వృద్దాప్యంలో వున్న ఆమె సొంత ఊరు రాజమండ్రిలో కన్నుమూశారు.
ప్రస్తుతం అలీ ఓ సినిమా షూటింగ్ లో భాగంగా రాంచీలో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అలీ హుటాహుటినా హైదరాబాద్ బయలు దేరారు. మరోవైపు అలీ తల్లి జైతును బీబీ పార్ధివ దేహాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అలీ బంధువులు. ఈ రోజు సాయంత్రం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, అలికి మాతృవియోగం సంభవించన క్రమంలో ఆయనకు సినీ, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
అలీకి కన్నతల్లిపై ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిదండ్రులే కారణం అని ఎపుడు చెబుతూ ఉండేవారు. ఇప్పటికే అలీ తన తండ్రి పేరిట సామాజికి కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలీ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.
హాస్యనటుడు అలీ తల్లి జైతును బీబీ మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె తుదిశ్వాస విడిచారన్న వార్త పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తనకు తెలుసని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more