romantic song from Ashwathama released నాగశౌర్య ‘అశ్వథ్థామ’ నుంచి రొమాంటిక్ సాంగ్

Naga shourya s ashwathama releases romantic song

Naga Shourya, Ashwathama, Ashwathama to release, Ashwathama release date, Mehreen, Ramana Teja, Usha Mulupuri, IRA creations, Naga Shourya news, Ashwathama movie relese date, film updates, tollywood news, Movies, Entertainment

Naga Shourya's Aswathama is yet to be released on January 31st. The film stars Shourya and Mehreen in the lead roles. Usha Mulupuri is bankrolling Aswathama and it is being presented by IRA creations banner, which had released a romantic song today.

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ నుంచి రొమాంటిక్ సాంగ్

Posted: 12/19/2019 06:36 PM IST
Naga shourya s ashwathama releases romantic song

యువ కథానాయకుల రేసులో తాను వున్నానంటూ తనదైన చిత్రాలలో నటిస్తూ సత్తా చాటుకుంటున్న నాగశౌర్య ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా ముందుగా ఆయన జనవరి 31న ప్రేక్షకులను పలకరించనున్నాడు. బబ్లీ బ్యూటీ మెహరీన్ జంటగా ఐరా క్రియషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. కొత్త సంవత్సరం తొలి నెల చివర్లో అనగా జనవరి 31న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో.. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ .. అవినీతిపరులను నిలదీసే పాత్రలో నాగశౌర్య కనిపించనున్నాడు. ఈ చిత్రంతో నూతన దర్శకుడు రమణ తేజ తెలుగు వెండితెరకు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అశ్వథ్థామ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ప్రేమకథా చిత్రం కోసం కుర్రాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. "నిన్నే నిన్నే ఎదలో నిన్నే .. చెలియా నీకై నే వేచానులే.. అలుపే రాదే .. అదుపే లేదే .. అయినా సమయం సరిపోదులే " అంటూ ఈ పాట సాగుతోంది. నాగశౌర్య .. మెహ్రీన్ పై చిత్రీకరించిన ఈ పాట అందంగా .. ఆహ్లాదంగా అనిపిస్తోంది. రమేశ్ వాకచర్ల సాహిత్యం .. అర్మాన్ మాలిక్ - యామినీ ఘంటసాల ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మేకింగ్ షాట్స్ ను జోడిస్తూ వదిలిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. సొంత బ్యానర్లో నాగశౌర్య చేసిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aswathama  Naga Shaurya  Mehreen  Ramana Teja  Usha Mulupuri  IRA creations  tollywood  

Other Articles