Rana Daggubati Hiranya Kashyap will be a smash hit ‘హిరణ్య కశిప’ కోసం సిద్దమౌతున్న దగ్గుబాటి

Rana daggubati hiranya kashyap will be a super hit

Rana Daggubati, Hiranya Kashyap, mythological drama, Gunasekhar, pan indai movie, Virata Parvam, sai pallavi, venu udugula, Tollywood, movies, Entertainment

After living in the US for months post a kidney-related surgery, Rana Daggubati is very much in Hyderabad and is ready to work out for director Gunasekhar project Hiranya Kashyap. The mythological drama has been in the planning for more than three years.

రాణా ‘హిరణ్య కశిప’ బంఫర్ హిట్ దగ్గుబాటి

Posted: 12/16/2019 06:39 PM IST
Rana daggubati hiranya kashyap will be a super hit

బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అటు బాలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు చేజిక్కించుకుని బిజీగా మారిపోయిన నటుడు దగ్గుబాటి రానా.. తన కిడ్నీ సర్జరీ నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకుని నటిస్తున్న తాజా చిత్రం హిరణ్య కశిప. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపోందిస్తున్న ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న క్రమంలో తొలి నుంచి ఈ చిత్రంపై అంచనాలు బాగానే వున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.

వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నా ఈ చిత్రంతో మరో మారు యావత్ భారతీయ చిత్ర ప్రేక్షకుల ముందుకు మరో పాన్ ఇండియా చిత్రంతో రావాలని ఆయన కాంక్షిస్తున్నారు. 'హిరణ్య కశిప'లో ప్రధాన పాత్రను చేయనున్న ఆయన, ఆ పాత్ర కోసం మళ్లీ కండలు పెంచవలసి వుంది. త్వరలోనే అందుకు సంబంధించిన కసరత్తు మొదలుకానుందని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తమ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దడానికి సురేశ్ బాబు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా, ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా ప్రీప్రొడక్షన్ వర్క్ అమెరికా- హైదరాబాద్ సహా పలు చోట్ల జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి` తరువాత ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టాడు. ఈసారి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సుదీర్ఘ సమయం తీసుకుని ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. పనిదినాల కారణంగా బడ్జెట్ పెరుగకుండా.. అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసేలా ప్రతిదీ పక్కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేందుకు ఆస్కారం ఉందని.. భారీ విజయాన్ని సాధిస్తుందని డి. సురేష్ బాబు పదే పదే చెబుతున్నాడు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. గ్రాఫిక్ డిజైనర్ పని చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పని పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Hiranya Kashyap  mythological drama  Gunasekhar  Virata Parvam  Tollywood  

Other Articles