Veteran actor Gollapudi Maruti Rao no more బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Veteran writer and actor gollapudi maruthi rao passes away

Gollapudi Maruti Rao, Chennai, Gollapudi Maruti Rao news, gollapudi maruthi rao death, Gollapudi Maruti Rao passes away, Gollapudi Maruti Rao no more, Gollapudi Maruti Rao novels, Gollapudi Maruti Rao cinemas, Gollapudi Maruti Rao dialogues, gollapudi maruthi rao telugu movies, gollapudi maruthi rao latest news, gollapudi maruthi rao tollywood, Tollywood, Movies, Entertainment,

Telugu actor Gollapudi Maruti Rao passed away here on Thursday at a hospital in Chennai. He was 80. Born on April 14, 1939 in Vizianagaram, Rao ventured into the film industry with Intlo Ramaiah Veedilo Krishnaiah and went on to act in over 250 films. He authored various books, novels and plays.

బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Posted: 12/12/2019 02:28 PM IST
Veteran writer and actor gollapudi maruthi rao passes away

ప్రముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. నాటకరంగం, రచయిత, వక్త, వ్యాఖ్యాతగా, పలు రంగాలలో తన సత్తాను చాటిన ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఏకంగా 290 చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించి.. ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు.

సినీరంగ ప్రవేశానికి ముందుకు ఆయన నాటక రంగంలో రాణించారు. పలు నాటిక, నటకాలు, నవలలు, కథలు కూడా రచించారు. రచయితగా, సంభాషణకర్తగా కూడా ఆయన ప్రతిష్మాత్మక నందీ అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో మొదటి రచన 'డాక్టర్ చక్రవర్తి'కి ఉత్తమ రచయితగా ఆయన నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయంటే ఆయన ఎంతటి మేధావి అన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అయితే నాటకరంగంపై వున్న మక్కువతో.. సినీరంగంపై ఆసక్తితో ఆయన చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య చిత్రంతో సినీమాల్లోకి తెరంగ్రేటం చేశారు. ఆ చిత్రానికి ఆయనే మాటల రచయితగా కూడా వ్యవహరించారు.

తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా ఉంది. మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన భార్య పేరు శివకామసుందరి.. ఆయనకు ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gollapudi Maruti Rao  Actor  Writer  Anchor  Screen Writer  dialogue writer  Tollywood  

Other Articles

 • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

  తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

  Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

 • Nithin to got out door location for his andhadhun remake

  ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

  Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

 • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

  తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

  Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

 • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

  ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

  Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

 • Yeleti cooking chess backdrop for nithin check

  హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

  Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh