Iddari Lokam Okate gears up for release ‘‘ఇద్దరి లోకం ఒకటే’’ స్వచ్చమైన ప్రేమకథ..

Iddari lokam okate gets u a gears up for release

Raj Tarun, Shalini Pandey, Arjun reddy, dil raju, Sirish, iddari lokam okate, love entertainer, movie, producer, sirish, sri venkateswara creations, Christmas, Tollywood, movies, Entertainment

With young hero Raj Tarun, and Arjun Reddy fame Shalini Pandey in the lead roles, the movie Iddari Lokam Okate is gearing up for release on December 25. Touted to be a ‘love entertainer’, it is being presented by producer Dil Raju and produced by Sirish

‘‘ఇద్దరి లోకం ఒకటే’’ స్వచ్చమైన ప్రేమకథ..

Posted: 12/16/2019 07:22 PM IST
Iddari lokam okate gets u a gears up for release

స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో రూపోందుతున్న చిత్రం `ఇద్దరి లోకం ఒకటే` క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 25న విడుదలకు అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. యువకథానాయకుడు రాజ్‌ తరుణ్ హీరోగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే రాజ్ తరుణ్ సరసన నటిస్తున్నారు.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై శిరీష్‌ నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇది ప్రేమ కథా చిత్రంగా రూపోందింది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తన సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ``టర్కీష్ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని `ఇద్దరి లోకం ఒకటే` సినిమాను రూపొందించారు. నేను మాతృకలో సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. తర్వాత స్క్రిప్ట్ విన్నాను. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. ఇందులో నా పాత్ర సెటిల్డ్ గా ఉంటుంది. షాలిని పాండే చాలా అద్భుతంగా నటించింది`` అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles