వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ చిత్రాన్ని జనవరి 24న 2020లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. నటి నభా నటేశ్.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో రవితేజ సరికొత్తగా స్టైలిష్ గా కనిపించాడు.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా యాక్షన్ షాట్స్‌ను డిజైన్ చేశామని దర్శకుడు చెప్పారు. రవితేజ రిట్రో గెటప్‌పై షూట్ చేసిన యాక్షన్ షాట్స్‌ను టీజర్లో పొందుపరిచామని, ఇవి ఫ్యాన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటాయని అన్నారు. టీజర్ స్టార్టింగ్‌లో రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు.
రవితేజ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చే విధంగా ‘డిస్కోరాజా’ని సిద్ధం చేస్తున్నామన్నారు. తాన్యా హోప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more