మారుతి దర్శకుడిగా సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజూ పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ధరమ్ తేజ్ కి రమారమి ఫ్యామిటీ ఎంటైర్ టైనర్ తో పాటుకామెడీని కలగలిపి చక్కని చిత్రాన్ని రూపోందించారని ట్రైయిలర్ ద్వారా అర్థమవుతోంది.
తాజగా ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో మెయిన్ కంటెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టర్స్ ను కూడా క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేశారు. సత్యరాజ్ పాత్ర చుట్టూ అల్లుకున్న డ్రామాను హీరో లీడ్ చేయడం కనిపిస్తోంది. ఈ క్రమంలో మిగిలిన పాత్రల ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి.. చివరికీ ఆ పాత్రలు ఎలా మారాయి అంశాలు సినిమా సాగనుందని ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది.
కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more