Adugadugo Action Hero song promo released బాలయ్య ‘రూలర్’ వీడియో సాంగ్ అదిరింది.!

Ruler witness balakrishna s swag in adugadugo action hero

Nandamuri Balakrishna, Ruler Adugadugo Action Hero song promo, Director KS Ravi Kumar, Ruler movie, Balakrishna Ruler movie, Vedhika, Sonal Chauhan, Ruler Teaser, ruler, KS Ravi Kumar, Chirantan Bhatt, Balakrishna, Tollywood, movies, entertainment

After the colossal disasters of NTR: Kathanayakudu and NTR: Mahanayakudu, Nandamuri Balakrishna is eyeing to score a hit at any cost with his upcoming film, Ruler. Directed by KS Ravikumar, this film will be hitting the screens on the 20th fo December.

బాలయ్య ‘రూలర్’ వీడియో సాంగ్ అదిరింది.!

Posted: 12/04/2019 08:31 PM IST
Ruler witness balakrishna s swag in adugadugo action hero

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రూలర్’ టీజర్ ను విడుదల చేసిన తరువాత ఆ చిత్రానికి సంబంధించి తొలి సింగిల్ బయటకు వదిలింది చిత్రయూనిట్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌.. హీరో ఎలివేట్ చేసే సన్నివేశాలతో పాటు పాటలను కూడా జోడించారు.  చిత్రంలో మాస్ డైలాగులతో పాటు ఫ్యాన్స్ కోరుకునేట్టుగా ఫైట్స్ ను కూడా పెట్టారు. పోలీసు దుస్తుల్లో మెరిసిపోతున్న బాలయ్య.. గడ్డంతో కాసింత రఫ్ లుక్ లో కనిపించడం కూడా ఢిఫరెంట్ వేరియేషన్ ను ప్రదర్శింపజేస్తుంది.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటి నిన్నటి హీరోయిన్ భూమిక కనిపించనుంది. ఇప్పటివరకూ ‘రూలర్‌’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్‌, మాస్ లుక్ లు సినిమాపై అంచనాలను పెంచగా, గత వారం రిలీజ్ అయిన టీజర్‌ మరింత ఆసక్తిని రేపింది. ఇక దీంతో రూలర్ నుండి అడుగ‌డుగో యాక్ష‌న్ హీరో అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ భాస్క‌రుని ఆల‌పించారు. తాజాగా ఇదే పాట వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న‘రూలర్‌’ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోస్టు ప్రోడక్షన్స్ పనుల్లో నిమగ్నమైన చిత్రయూనిట్.. పనిలో పనిగా గ్లిమ్స్ వదిలారు. ఈ మూవీలో బాలయ్య చాలా స్లిమ్ గా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vedhika  Sonal Chauhan  Ruler song promo  ruler  KS Ravi Kumar  Chirantan Bhatt  Balakrishna  Tollywood  

Other Articles