sexually assault on woman art director by minors మహిళా అర్ట్ డైరెక్టర్ పై మైనర్ల అసభ్య ప్రవర్తన

Sexually assault on woman art director by minors on busy road in hyderabad

tollywood art director, woman art director, minors, minors attack, banjara hills, sexual assault, Hyderabad, panjagutta CI, Helpline 100, Tollywood, crime, movies, Entertainment

In a Shocking incident, A tollywood woman art director has been sexually assaulted by three minors on a busy road in Hyderabad. Three minor boys attacked the Cine Art Director.

మహిళా అర్ట్ డైరెక్టర్ పై మైనర్ల అసభ్య ప్రవర్తన

Posted: 12/03/2019 07:35 PM IST
Sexually assault on woman art director by minors on busy road in hyderabad

దేశవ్యాప్తంగా దిశ హత్యోదంతం కేసు పెను సంచలనంగా మారి.. పార్లమెంటులో ఇదే అంశం దద్దరిల్లిపోవడంతో జాతీయ నేతల అందరి చూపు తెలంగాణ వైపే వున్న తరుణంలో మరో దారుణమైన ఘటన హైదరాబాద్ నగరం రహదారిపై జరిగడం కలకలం రేపుతోంది. సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ కారును ఢీకొట్టిన ముగ్గురు మైనర్లు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడమే కాదు దాడి కూడా చేశారు. మహిళలను ముందుపెట్టి ఆర్ట్ డైరెక్టర్ పై అమానుషంగా ప్రవర్తించారు.

అమె లోదుస్తులను చించి వేయడం, ఫ్యాంటును లాగడం.. అమె ప్రైవేటు ఫార్ట్స్ తాకడంతో పాటు నానా రభస చేశారు. చేయాల్సినదంతా చేసిన తరువాత మహిళలను ముందుకు నెట్టేసారని బాధితురాలు తెలిపింది. ఇక రాష్ట్ర మంత్రులు 100 డయల్ చేసివుంటూ దిశను క్షణాల్లో కాపాడగలిగేవాళ్లమని చెప్పుకున్న గొప్పలు కూడా నీటిమూటలని తేలిపోయాయి. బంజారాహిల్స్ లో జరిగిన అమానుష ఘటనలో బాధితురాలు 100 డయల్ చేసిన 40 నిమిషాల తరువాత.. పోలీసులు వచ్చారని తెలపడమే ఇందుకు నిదర్శనం.

ఇక బాధితురాలు పోలీసులకు చేసిన పిర్యాదు మేరకు ఘటన వివరాలు ఇలా వున్నాయి. సినీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కారులో వెళ్తున్నారు. ఆమెను ముగ్గురు ఆకతాయిలు వెంబడించారు. ఆమె కారు ఢీకొట్టారు.. ఆమె కారు ఆపడంతో కారులో నుంచి బయటకు లాగి ఆమెపై  పట్ల వికృత చేష్టలకు పాల్పపడ్డారు. ఆమెను బండ బూతులు తిడుతూ.. వెనుక నుంచి కొడుతూ లో-దుస్తులు చించేశారని భాదితురాలు పిర్యాదులో పేర్కోంది.

బాధితురాలిపై దారుణంగా ప్రవర్తించడంతో పాటు అమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారని పేర్కోంది. తన టీషర్టును లాగేందుకు కొందరు ప్రయత్నించగా, మరికొందరు ముందునుంచి తన లోదుస్తులను లాగారని, తన ఫ్యాంటును కూడా లాగేందుకు ప్రయత్నించారని, ఇక వారితో వచ్చిన మహిళ కూడా తన టీషర్టును తీసివేసేందుకు ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాక్సిడెంట్ కేసుగా భావించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అయితే జరిగిన విషయం సీఐ తెలుసుకొని ఆమె ఆదేశాలతోనే బంజారాహిల్స్ పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితురాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles