Mahesh Babu starrer fixed date to release its teaser మహేష్ ఫ్యాన్స్ ‘మైండ్ బ్లాక్’ చేసిన డీఎస్పీ

Sarileru neekevvaru mahesh babu packs a punch as an army commando in this pakka action entertainer

Anil Sunkara, dil raju, mahesh babu, rashmika mandanna, Sarileru Neekevvaru, Mind block song, Vijayashanti, Prakash Raj, Anil ravipudi, DSP, tollywood, movies, entertainment

After much anticipation and hype from the past few days, the teaser of Mahesh Babu’s upcoming actioner Sarileru Neekevvaru has been finally unveiled on social media a few moments.

మహేష్ ఫ్యాన్స్ ‘మైండ్ బ్లాక్’ చేసిన డీఎస్పీ

Posted: 12/02/2019 09:33 PM IST
Sarileru neekevvaru mahesh babu packs a punch as an army commando in this pakka action entertainer

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. అలా చేశాడు సుప్రసిద్ద సంగీత దర్శకుడు డీఎస్పీ. ఔనా.. అంటే నిజమని చెప్పాక తప్పదు. ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నుంచి మొదటి సాంగ్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేస్తామని గతంలోనే ప్రకటించిన చిత్ర యూనిట్‌.. ఈ సోమవారం సాయంత్రం మొదటి పాటను విడుదల చేసింది.

మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటలో మహేష్ డైలాగ్స్‌ కూడా మేళవించివున్నాయి. మైండ్ బ్లాక్ గానంతో నిజంగానే తమ మతి శృతి తప్పిందంటున్నారు మహేశ్‌ అభిమానులు. ఫ్యాన్స్ అలోచనలకు తగ్గట్టుగా, తనదైన శైలీలో దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌ కట్టాడు. మాస్ బిట్స్‌తో, రైమింగ్ పదాలతో ‘మైండ్ బ్లాంక్’ చేసేశాడు. రెనైనా రెడ్డి, బ్లాజ్‌ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి, దేవీ శ్రీ ప్రసాద్  లిరిక్స్‌ అందించారు. ఇక అలా రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే ట్రెండింగ్ అవుతోందీ పాట.

నెట్టింట్లోని జనులకు కూడా ‘మైండ్ బ్లాంక్’ చేస్తున్న సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మందన్న మహేష్ కు జోడీగా నటించగా, లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.  దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles