డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యాచారం ఉదంతం సినీనటులను కూడా కదిలిస్తోంది. అమె హత్యోదంతంపై నటీమణులు స్పందించారు. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని వుంటే అంటూ మరోనటి.. తాను కర్మను నమ్ముతానని, అది అనుక్షణం వెంటాడుతూనే ఉంటుందని మరో అగ్రనటి ఇలా పలువురు స్పందించారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నర్ శ్రీముఖి కూడా స్పందించారు. ఇప్పుడీ అంశమే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy pic.twitter.com/9vCKsbsj1O
— Keerthy Suresh (@KeerthyOfficial) November 29, 2019
ఈ మేరకు నటి కీర్తి సురేష్ స్పందిస్తూ.. "డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి, సజీవదహనం చేశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ వంటి నగరంలో ఇంత దారుణ ఘటనకు ఎవరిని నిందించాలి? రోజులో ఏ సమయంలోనైనా ఓ అమ్మాయి సురక్షితంగా తిరిగే రోజులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి? నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ కష్టం నుంచి వారు త్వరగా బయట పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను కర్మను నమ్ముతాను. అది 24/7 పనిచేస్తూనే ఉంటుంది" అని పేర్కొంది.
This is so so disrespectful of police ..... shame on who ever asked the question .... lechipoindi emo ...... disgusted...... wtf ? https://t.co/CrPMeZ0ytL
— पूनम कौर poonam kaur (@poonamkaurlal) November 29, 2019
సినీ నటి అనుష్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపేశారని... ఇది మొత్తం మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని అన్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.
ఇక ఈ దారుణఘటనలో పోలీసులు సకాలం స్పందించి చర్యలు చేపట్టి వుంటే ఈ అఘాయిత్యం జరిగివుండేది కాదేమోనని సినీ నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ప్రియాంక తండ్రి పోలీసులను ఆశ్రయించగా, మీ కుమార్తె ఎవరితోనో వెళ్లిపోయుంటుందేమో అని పోలీసులు చులకనగా మాట్లాడినట్టు తెలిసింది. దీనిపై నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని లేచిపోయిందేమో అనడానికి పోలీసులకు సిగ్గు లేదా? అంటూ మండిపడ్డారు. అసహ్యంగా ఉంది, పోలీసుల తీరు మర్యాదకరం అనిపించుకోదు అంటూ వ్యాఖ్యానించారు.
I am not scared to have a house in a jungle may be a hut to survive n food to eat ,I will be aware of the animals n I will fence myself according to their nature ...I will know what a animal does but how do we live in these concrete jungle of organised crime ? #RIPPriyanakaReddy
— पूनम कौर poonam kaur (@poonamkaurlal) November 29, 2019
ఇక మరో ట్వీట్ లో దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య వాటిని నుంచి రక్షణ తీసుకుంటూ బతకడంలో ఇబ్బంది లేదని, అయితే కాంక్రీట్ జంగిల్ లో మానవ మృగాళ్ల మధ్యన బతకడం కష్టమని అమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయమై స్పందించిన యాంకర్, బిగ్ బాస్ సీజన్ 3 రన్నరఫ్ శ్రీముఖి.. ప్రియాంక రెడ్డి హత్యోదంతం తనను కలసివేసిందని అన్నారు. రోడ్డుపై ఎవ్వరు కనిపించినా.. వారు అపరిచితులేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇక తాము అపదలో వున్నామని తెలిస్తే జీపీఎస్ ట్రాకింగ్ యాప్స్ కూడా అందుబాటులో వున్నాయని, అవికాక 100, 112, షీ టీమ్స్ నెంబర్లు ఫోన్లలో ఫీడ్ చేసి పెట్టుకోవాలని కోరింది.
Nothing short of gruesome and heinous ....Deeply disturbed hearing about it. We as a country need to protect our girls or we have no future as a race. Hope justice prevails. #RIPPriyankaReddy
— Allari Naresh (@allarinaresh) November 29, 2019
(And get your daily news straight to your inbox)
Dec 10 | మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్... Read more
Dec 10 | ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన... Read more
Dec 10 | దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ... Read more
Dec 10 | కార్తీ నుంచి ఇటీవల వచ్చిన 'ఖైదీ' తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. యాక్షన్ .. ఎమోషన్ తో మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా... Read more
Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more