ASN Trailer Talk: Rashmika's ex impresses! రంగస్థలానికి కొత్త ఆటగాడోచ్చాడు.. 'అతడే శ్రీమన్నారాయణ' ట్రైలర్

Nani launches athade srimannarayana telugu trailer

Rakshit Shetty, Athade Srimannarayana, Shanvi, ASN trailer, Shanvi Srivastava, Balaji Manohar, Achyutha Kumar, Pramod Shetty, Athade Srimannarayana movie, Sachin, Hero Nani, Tollywood, movies, Entertainment

Nani launches 'Athade Srimannarayana' Telugu trailer ... Krishna Indraganti's 'V', launched the Telugu trailer of Rakshit Shetty starrer 'Athade Srimannarayana'.

రంగస్థలానికి కొత్త ఆటగాడోచ్చాడు.. 'అతడే శ్రీమన్నారాయణ' ట్రైలర్

Posted: 11/28/2019 10:19 PM IST
Nani launches athade srimannarayana telugu trailer

కన్నడ దర్శక నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. షాన్వి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైయిలర్ న్యాచురల్ స్టార్ నానీ ఇవాళ చిత్ర sÁబృందంతో కలసి విడుదల చేశారు. ట్రైలర్ లో రక్షిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నిధి కోసం వెతికే ముఠా.. దానికో నాయకుడు.. వాళ్లని రక్షిత్ శెట్టి ఎలా డీల్ చేస్తాడనేది కధ, ట్రైయిలర్ లో వినిపించిన డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను అకట్టుకుంటున్నాయి.

కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోన్న ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే అయిదు బాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళంలో ధనుష్, మలయాళంలో నివిన్ పాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా ట్రైలర్‌ను ప్రేక్షకులతో పంచుకున్న నాని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

బాలాజి మనోహర్, అచ్యుత కుమార్, ప్రమోద్ శెట్టి, మధుసూధన్ రావు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సచిన్ దర్శకత్వం వహించారు. పుష్కర మల్లికార్జునయ్య నిర్మాత. అజనీష్ లోక్‌నాథ్, చరణ్ రాజ్ సంగీతం సమకూర్చారు. కన్నడలో ఫాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను మాత్రం రక్తికట్టించే విధంగా యాక్షన్, డైలాగ్స్ అన్ని సమపాలలో వుండేట్లు కట్ చేశారు.. మరి సినిమాను ఎలా రూపోందించారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతోంది. దీనిలో తెలుగు కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles