OMG Daddy Song Teaser From Allu Arjun Ala Vaikunthapurramuloo బాలల దినోత్సవ వేడుక - omg daddy

Omg daddy song teaser from allu arjun ala vaikunthapurramuloo

omg daddy song, Ala Vaikunthapurramuloo, Allu Arjun, Pooja Hegde, Trivikram

The omg daddy song teaser from Allu Arjun Movie 'Ala Vaikunthapurramuloo' released today, on the eve of Children's Day

బాలల దినోత్సవ వేడుక - omg daddy

Posted: 11/14/2019 11:21 AM IST
Omg daddy song teaser from allu arjun ala vaikunthapurramuloo

తన మధుర సంగీతంతో మన మనస్సులలో ఒక చెదరని ముద్ర వేసుకున్న తమన్ ..మన అందరికి ఎంతో సుపరిచితుడు.. ఒక పాట కాదు పలు పాటలతో నేడు మనల్ని అలరిస్తున్నారు.. మొన్నటి వరకు సా మజగమనా అనే పాట ఆలాపనలో తిరుగాడాము.. నిన్నటి వరకు రాముల రాముల పాట ..నేడు omg daddy అనే మరో పాటను వినడానికి దాని మాయలో ఊరేగడానికి సిద్ధంగా ఉండండి .. అంతలా మన హృదయాలలో ఆ పాటలు వినిపిస్తున్నాయి.. పాటలు విజయవంతం అయితే సగం సినిమా విజయవంతం అవుతుంది అని గట్టి నమ్మకం .. ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఒక రెండు పాటలు విడుదల అయ్యి ఎక్కడ చుసిన ఆ పాటలా కోలాహలమే.. ఇపుడు తాజాగా omg daddy పాట అల్లు అర్జున్ గారి సినిమా పై అంచనాల సంఖ్య భారిగా పెంచేసాయి.. విడుదల ఐన తక్కిన రెండుపాటలా మాదిరిగా ఈ పాట కూడ మనల్ని అలరిస్తుందని కోరుకుందాం.

నేడు బాలల దినోత్సవ వేడుకను పురస్కరించుకొని అల్లు అర్జున్ గారు తన పిల్లలు ఆయాన్ మరియు అర్హ లా చేతుల మీదగా ఈ పాటను omg daddy వి డుదల చేసారు.. ఈ పాట నేపథ్యం చాల సరళంగా మన మధ్య తరగతి ప్రేమను బంధాలను చూపెడుతుంది.. .. అల్లు అర్జున్ తన పిల్లలతో ఎలా మెదలుతారో ప్రేమానురాగాలను ఏ విధంగా కురిపిస్తారో .. మరియు ఎంత కఠినంగా హద్దులల్లో ఉంచుతారో ఈ పాట లో అర్ధం చేసుకోవొచ్చు.. .. అంతలా తమన్ తన ప్రతిభను ఈ పాటలో కనబరిచారు.. అంతేకాకుండా ఈ పాట చాల సరళంగా మనకు అందరికి అర్థమైయే విధంగా ఉండడం ప్రధాన ఆకర్షణ..

ఇంకా మొత్తం పాట విడుదల కావాల్సి ఉంది..తండ్రి చాటు బిడ్డలకు నాన్న కుచ్చిళ్లకు ఈ పాట అంకితం అయినా ఈ బాలల దినోత్సవ సందర్భంగా పిల్లల చేతుల మీదగా విడుదల ఐన ఈ పాట మనల్ని అలరించాలని అభిలషిదాం .. ఆలా వైకుంఠాపురానికి కూడా ఓసారి వెళ్లొదాం.. త్వరలో మన చిన్నారులతో కలిసి..

శ్రీవల్లి.. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : omg daddy song  Ala Vaikunthapurramuloo  Allu Arjun  

Other Articles