Karthi "Khaidi’ crosses Rs.100 cr Mark కార్తీ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ‘ఖైదీ’

Karthi khaidi movie dominates box office crosses rs 100 cr mark

karthi, karthi movies, karthi photos, karthi gallery, karthi khaithi movie, karthi khaithi collections, karthi khaithi 100 cr mark, Khaithi Latest Collections, Box Office, Tamil actor Karthi, Malavika Avinash, arain, Ramana, George Maryan, Tollywood, movies, entertainment

Tamil actor Karthi's career is going great guns. His latest movie Khaithi in which he plays a prisoner out on parole is doing well at the box office. Khaithi is collecting good money at the ticket windows and has also entered the 100 crore club recently.

కార్తీ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ‘ఖైదీ’

Posted: 11/13/2019 02:49 PM IST
Karthi khaidi movie dominates box office crosses rs 100 cr mark

తమిళ హీరోల్లో అగ్రహీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. అజిత్.. విజయ్ చిత్రాలు యావరేజ్ గా వున్నా వారి చిత్రాలు అనతికాలంలోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోవడం అవలీలగా జరిగిపోతుంటాయి. అందుకు వారి క్రేజ్ కూడా దోహదపడుతుంది. వారు అంతకుముందు చిత్రాల్లో కనబర్చిన నటన.. ఎంచుకున్న కథలు వారి క్రేజ్ ను అభిమానుల్లో అలా నింపేసాయి. అయితే ఇదే సమయంలో మిగతా హీరోలు ఈ మార్కును చేరుకోవడం మాత్రం కొంత కష్టసాధ్యమైన పనే.

అలాంటి కష్టసాధ్యమైన 100 కోట్ల మార్క్ ను కాసింత సమయం తీసుకున్నా చేరుకున్నాడు హీరో కార్తి. పాటలు, గట్రా లేకుండా హీరోయిన్ పాత్రతో డాన్సులు లేకుండా వినూత్న రీతిలో వచ్చిన కార్తీ 'ఖైదీ' చిత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ చిత్రం విడుదల నుంచి అభిమానుల్లో అంచనాలను మించి తన పయనాన్ని సాగించింది. కార్తీ తన కెరియర్లో ఇంతవరకూ కొన్ని హిట్ సినిమాలు చేసినా, అవేవి 100 కోట్ల క్లబ్ లోకి చేరుకోలేదు.

100 కోట్ల క్లబ్ లో తన సినిమాను చూసుకోవాలనే కార్తీ కలను 'ఖైదీ' నిజం చేసింది. కెరియర్లో తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ చూసినందుకు కార్తీ సంతోషంతో పొంగిపోతున్నాడు. విజయ్ 'విజిల్' సినిమా పోటీని తట్టుకుని కార్తీ 'ఖైదీ' ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. కంటెంట్ పై నమ్మకంతో బరిలోకి దిగిన కార్తీని ఆ కంటెంటే కాపాడిందని అంటున్నారు. దీంతో తమిళనాట తనకంటూ ఓ క్రేజ్ ఏర్పర్చుకునేందుకు కార్తీకి పట్టు లభించిందనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles