మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనను అబాలగోపాలం కీర్తిస్తున్నారంటే.. ఆయన ఎంతగా ఈ చిత్రం కోసం శ్రమించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై ఇవాళ ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో చిరంజీవి నటనను ప్రశంసించారు.
గడచిన 20 సంవత్సరాల్లో తాను చూసిన రెండో చిత్రం చిరంజీవి నటించిన 'సైరా' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. మెగాస్టార్ కోరిక మేరకు సినిమాను చూసిన ఆమె, ఆపై మీడియాతో మాట్లాడారు. చిత్రంలో చిరంజీవి అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. 1999 తరువాత తాను 2018లో రజనీకాంత్ నటించిన 'కాలా' చూశానని, ఆపై తాను చూసిన రెండో చిత్రం ఇదేనని ఆమె అన్నారు.
తమిళిసై కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబీకులు కూడా సినిమా చూశారు. కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'సైరా'లో చిరంజీవి నటనకు ప్రతిరూపంగా అమె పేర్కోన్నారు. ఈ చిత్రంలో పలు సన్నివేశాలు దేశభక్తిని ప్రేరేపించేవిధంగా.. రోమాలు నిక్కబోడుచుకునేలా వున్నాయని ఇప్పటికే సినీ విమర్శకులు సైతం ప్రశంసించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more