Sye Raa Narasimha Reddy Movie First Review చిరంజీవి ‘సైరా’ తొలి రివ్యూ వచ్చేసింది.!

First review of the most awaited sye raa narasimha reddy

Sye Raa Narasimha Reddy, Sye Raa review, sye raa narsimha reddy review, sye raa chiranjeevi, chiranjeevi sye raa, sye raa uae review, sye raa uae censor board, Umair Sandhu, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Tollywood, Entertainment, Movies

Umair Sandhu claims to be a part of UAE Censor Board and he has been putting out reviews and tweets about big action films from India. In this regard he mentioned Chiranjeevi’s Sye Raa Narasimha Reddy, to be a big block buster. This is the film first review from overseas.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ తొలి రివ్యూ వచ్చేసింది..!

Posted: 10/01/2019 09:12 PM IST
First review of the most awaited sye raa narasimha reddy

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన తరుణంలో అటు చిత్ర యూనిట్ కు ఇటు అభిమానులలో టెన్షన్ పీక్ స్టేట్ లో వుంది. చిత్రంపై ఎలాంటి టాక్ వస్తోంది.. రివ్యూలు ఎలా వుంటాయన్న నేపథ్యంలో ఇవాళ విడుదలైన తొలి రివ్యూ మాత్రం సైరాకు తిరుగులేదని, ప్రేక్షకులలో దేశభక్తిని పెంచే చిత్రం.. ఈ చిత్రం చూస్తున్న క్రమంలో పలు ఘటనల్లో రోమాలు నిక్కపోడుచుకోవడం ఖాయమన్న రివ్యూ వచ్చేసింది.

తొలిసారిగా మెగాస్టార్ నటిస్తున్న చారిత్రక చిత్రం తొలి రివ్యూ ప్రకారం చిత్ర నిడివి రెండు గంటలా 50 నిమిషాల 50 సెకన్లు. ఓవర్సీస్ నుండి ఈ తొలి రివ్యూ వచ్చేసింది. యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు భారీ చిత్రాల విడుదలకు రెండు మూడు రోజుల ముందే తన రివ్యూను భయటపెట్టేస్తాడు. సినిమాను చూసిన అతను సినిమా అద్భుతంగా ఉందని, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబోతుందని చెప్పాడు.

'సైరా’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుందని ట్వీట్ చేసాడు. అంతే కాదు ఈచిత్రానికి నేషనల్ అవార్డు ఖాయం అని చెప్పాడు. రివ్యూ పాజటివ్ గా రావడంతో చిరు ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా లో రచ్చ స్టార్ట్ చేసేసారు. అత్యున్నత నిర్మాణ విలువలతో హై స్టాండర్డ్స్ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీపడలేదని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపోందిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు వెంకన్న పాత్రలో మెరిసాడు. ఇక నరసింహారెడ్డి బార్య పాత్రలో నయనతార నటించింది. వీరితో పాటు తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు తదితరులు నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  Umair Sandhu  UAE Censor Board member  First review  Chiranjeevi  Ram Charan  Tollywood  

Other Articles