Sye Raa video song trends online చిరంజీవి ‘సైరా’ టైటిల్ వీడియో సాంగ్ ట్రెండింగ్..!

Sye raa title video song trends on social media

Sye Raa Narasimha Reddy, Sye Raa Title song, sye raa video song, sye raa video song, sye raa song trending online, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Tollywood, Entertainment, Movies

Tollywood Megastar Chiranjeevi’s upcoming historical-drama Sye Raa Narasimha Reddy, film unit release title video song, which goes trending on social media in top ten.

చిరంజీవి ‘సైరా’ టైటిల్ వీడియో సాంగ్ ట్రెండింగ్..!

Posted: 10/01/2019 11:00 AM IST
Sye raa title video song trends on social media

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటిస్తున్న చారిత్రాక చిత్రం ‘సైరా’ సినిమా విడుదలకు మరికోన్ని గంటల సమయం మాత్రమే వుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ విడుదలతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. అయితే తెలుగుతో పాటు దక్షిణాది బాషలతో పాటుగా అటు హిందీలోనూ ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో యావత్ భారత దేశ ప్రేక్షకులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ వేచిచూస్తున్నారు.

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపోందిన ఈ చిత్రంపై ఇటు మోగా ఫ్యాన్స్ లనూ అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తోడు చిరంజీవి చిత్రం, అందులనూ చారిత్రక నేపథ్యం వున్న చిత్రం కావడంతో అటు ఫ్యామిలీ అడియన్స్, ఇటు దేశభక్తిపరులు కూడా చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని వేచి చూస్తున్నారు.

కాగా, గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు తన ప్లాన్ ప్రకారం అన్ని చేస్తూనే వుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది,  నరసింహారెడ్డి గొప్పతనాన్ని తమన్నా, నయనతార కీర్తిస్తున్న సందర్భంలో సాగే ఈ పాటను భారీస్థాయిలో చిత్రీకరించారు. కొరియోగ్రఫీ కూడా కళ్లుచెదిరేలా ఉంది.

సాంగ్ సోషల్ మీడియా రికార్డులు బద్దలు కొడుతూ.. టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. ‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌరా.. ఉయ్యాల వాడ నారసింహుడా.. చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా.. రేనాటి సీమ కన్న సూర్యుడా.. నింగి శిరసు వంచి.. నమోస్తు నీకు అనగా.. నవోదయానివై జనించినావురా.. ఓ సైరా… ఓ సైరా…’ అంటూ సాగుతుంది. ఈ పాటను సిల్వర్ స్ర్కీన్ పై డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ లో వింటే రోమాలు నిక్కపోడుచుకోవడం ఖాయం.

అంటూ సాగే ఈ పాట వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ ఖాయం. ‘దాస్యాన జీవించి ఉండటం కన్నా చావెంత మేలంది నీ పౌరుషం’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి. అమిత్ త్రివేది కంపోజిషన్ లో … సునీధీ చౌహాన్, శ్రేయాఘోషల్ ఈ పాటను పాడారు. పాటలో చూపించిన సన్నివేశాలు… అత్యున్నతంగా ఉన్న మూవీ స్టాండర్డ్స్ ను చెబుతున్నాయి. రామ్ చరణ్ నిర్మాణంలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  video title song  trending online  social media  Chiranjeevi  Ram Charan  Tollywood  

Other Articles

 • I am glad that god has chosen me for this work sonu sood

  మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

  Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

 • Priyamani is comrade bharathakka in virata parvam

  విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

  Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

 • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

  నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

  Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

 • Samantha strong reply to haters goes viral on social media

  విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

  May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

 • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

  ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

  May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh