వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేశ్' ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, ఐదు రోజుల్లోనే మంచి వసూళ్లను సాధించింది. తొలి ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో 5.90 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. వచ్చేనెల 2వ తేదీన 'సైరా' వచ్చేంత వరకూ ఈ సినిమాకి పోటీలేదు. అందువలన మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకి, 'దేవత' సినిమాలోని పాట .. పూజా హెగ్డే గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ట్వీట్ ద్వారా స్పందించారు. వరుణ్ తేజ్ యాక్షన్ సూపర్బ్ అంటు అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారని.. అయితే ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ గా వరుణ్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ లో వుందని అన్నాడు. సినిమాను చూసి ఎంజాయ్ చేశానని. గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ యాక్షన్ అదిరిందింటూ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అద్భుతంగా పనిచేశారంటూ కొనియాడారు. గద్దలకొండ గణెష్ సినిమా టీం అంతటికి శుభాకాంక్షలు తెలిపారు.
Thoroughly enjoyed watching #GaddalaKondaGanesh! @IAmVarunTej as Ganesh was exceptionalGreat work by @harish2you and @14ReelsPlus Congratulations to the entire team on the well-deserved success
— Mahesh Babu (@urstrulyMahesh) September 24, 2019
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more