చిరంజీవి కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేసింది.
భారీ బడ్జెట్ తో రూపోందుతున్న సైరా నరసింహరెడ్డి చిత్రంలోనూ ఆయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోండగా, అదివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ తో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక రాంచరణ్ కేవలం చిత్ర గ్రాఫిక్స్ కే 45 కోట్ల రూపాయలను వెచ్చించారన్న నేపథ్యంలో అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ అందింది.
నయనతార, తమన్నా కథానాయకులు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మాత. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. పవిత్ర భూమి భారతాంబి ముద్దు కన్న తాను.. ఉయ్యాలవాడ నారసింహనూ.. అంటూ సాగిన ఈ పాటను అమిత్ త్రివేది స్వరపరిచగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన సాహిత్యం అలరించింది. శ్రేయా ఘోషల్, సునిధి చౌహన్ ఈ పాటను ఆలపించారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more