బిగిల్ ( విజిల్, ఈల) చిత్రంపై వివాదం ఆరంభమైంది. తమిళనాట క్రేజీ కాంబో గా తెరకెక్కుతున్న బిగిల్ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భీభత్సమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే బిగిల్ దర్శకుడు అట్లీ తో హీరో విజయ్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూడు సినిమాలు తమిళనాట కాంట్రవర్సీ రాజేయడం గమనార్హం. దీంతో తాజాగా నటుడు విజయ్ నటించే ప్రతి చిత్రానికి వివాదం తలెత్తడం మామూలైంది. పంచాయితీలు, కేసులు, కోర్టులు, ప్రభుత్వం వరరూ ఈ వివాదాలు వెళుతున్నాయి.
విజయ్, అట్లీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం బిగిల్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్లో చెపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై కలెక్టర్ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నటుడు విజయ్‌కు తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.
మత్య్స, మాంస వ్యాపారులు తమ వృత్తిని ప్రారంభించే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారన్నారు. అలాంటి కత్తులపై నటుడు విజయ్ కాలు పెట్టి కూర్చున్న దృశ్యంతో కూడిన బిగిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారన్నారు. ఇది మత్స్య, మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించేలా ఉందన్నారు. ఈ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని లేదంటే.. తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more