Amitabh Bachchan Has Worked Free For Chiranjeevi బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు చిరంజీవి విలువైన కానుక

Chiranjeevi gives precious gift to amitabh bachchan

Chiranjeevi, Amitabh Bachchan, Sye Raa Narasimha Reddy, Susmitha, precious gift, Excel Entertainment, Farhan Akhtar, Kiccha Sudeep, Pawan Kalyan, Ram Charan, South Indian Movies, SouthIndianMovies, Telugu cinema, Vijay Sethupathi movies, Entertainment, Tollywood

Tollywood megastar chiranjeevi gifts bollywood megastar amitabh bachchan gold jewellery designed by daughter susmitha, as he had acted for free in Sye Raa movie for chiranjeevi.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు చిరంజీవి విలువైన కానుక

Posted: 09/17/2019 11:27 AM IST
Chiranjeevi gives precious gift to amitabh bachchan

చిత్ర పరిశ్రమ అంటే సినిమాలు, పారితోషికాలు, వసూళ్లే కాదు.. నటీనటుల మధ్య మంచి స్నేహం కూడా ఉంటుంది. ఇద్దరు అగ్రహీరోల మధ్య అలాంటి స్నేహబంధం పెనవేసుకోవడం చిత్రపరిశ్రమకు, దానిపై ఆధారపడిన వారికి శుభసూచకమే. అందుకు మన మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లే నిదర్శనం. ఈ స్నేహంతోనే తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితకథను తెరకెక్కించే ప్రాజెక్టులో వీరిద్దరి నటన అవిష్కృతమైంది.

తాను నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కీలక పాత్ర చేయాలని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా అమితాబ్ చిరంజీవికి ఓకే చెప్పేశారు. పైగా చిరు ప్రత్యేకంగా అమితాబ్ ను కలిసి మరీ సినిమాలో నటించమని అడగలేదు. కేవలం ఒక్క మెసేజ్‌తోనే సినిమాకు ఒప్పుకొన్నారు. అంతేకాదు షూటింగ్ కు వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్లకు డబ్బు కూడా వద్దన్నారు. అంతెందుకు అమితాబ్ సైరా కోసం ఒక్క రూపాయి పారితోషికం కూడా అడగలేదు.

అయితే తనకోసం ఇంత చేసిన బిగ్ బి అమితాబ్‌ కు చక్కని బహుమతిని అందించాలని చిరంజీవి తలిచారు. అనుకున్నదే తడవుగా సైరా చిత్రం ప్రమోషన్ వర్కులో బిజీగా వున్నప్పటికీ ఆయన అమితాబ్ ను కులుసుకుని ఆయనకు బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారట. వీటిని చిరు పెద్ద కుమార్తె సుస్మిత డిజైన్ చేశారట. వాటి ఖరీదు కూడా ఎక్కువేనట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో చిరు.. ఉయ్యాలవాడ పాత్రలో నటించగా.. ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటించారు. అమితాబ్ బచ్చన్.. చిరుకి గురువు పాత్రను పోషించారు. విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్, తమన్నా కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Amitabh Bachchan  Sye Raa Narasimha Reddy  Susmitha  precious gift  tollywood  

Other Articles

  • Actor nanduri uday kiran dies of cardiac arrest

    గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

    Feb 15 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు.... Read more

  • Hero nithin and shalini engagement pelli panulu started

    పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

    Feb 15 | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని... Read more

  • World famous lover trailer is out vijay deverakonda will make you feel the pain literally

    ‘‘మీ ఇంట్ల కొట్టుకోరా.. భార్యభర్తలు కొట్టుకోరా..’’

    Feb 06 | సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియర్... Read more

  • Ss rajamouli s period epic rrr release date postpones by six months

    అర్ఆర్ఆర్ తాజా అప్ డేట్: అభిమానులను నిరాశ

    Feb 05 | యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ పై తాజాగా ఓ అప్ డేట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం... Read more

  • Tamil actor comedian yogi babu marries manju bhargavi in thiruttani

    మంజు బార్గవితో కమేడియన్ యోగిబాబు పెళ్లి..

    Feb 05 | తమిళ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ కమేడియన్ యోగిబాబు ఓ ఇంటివాడు అయ్యాడు. కమెడియన్ పలు చిత్రాలు చేసిన పాపులారిటీ సంపాదించిన దక్షిణాది ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్నాడు యోగిబాబు. చిత్ర రంగానికి చెందిన అగ్రహీరోలతో... Read more

Today on Telugu Wishesh