రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రాల తరువాత తన స్టామినాను ‘సాహో’ చిత్రం ద్వారా చూపించారు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా, క్రిటిక్స్ రేటింగ్ తో సంబంధం లేకుండా తన సినిమా బాక్సాఫీసును షేక్ చేయగలదని ప్రూవ్ చేస్తున్నారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’.. గత నెల 30న ప్రేక్షకుల ముందుకు రాగా, తొలివారం కూడా పూర్తికాకుండానే నాలుగు వందల కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది. నెగిటివ్ టాక్ సాహోపై ప్రభావం చూపకపోగా, వసూళ్లలో దూసుకుపోతుంది.
సాంకేతిక పరంగా ‘సాహో’ మంచి మార్కులు కొట్టేసింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ప్రీమియర్స్ తో కలుపుకుని 130 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజునే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లోను కలుపుకుని 5 రోజుల్లో 350 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 400 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. 500 కోట్ల మార్క్ ను టచ్ చేయడం 'సాహో'కి పెద్ద కష్టం కాకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
తెలుగులో ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, 'సాహో' దూకుడు కొనసాగే అవకాశాలున్నాయి. అటు బాలీవుడ్ లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. నాలుగు రోజులకుగాను 93 కోట్లను వసూలు చేసింది. నిన్న హిందీ వెర్షన్ 9.10 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో 5 రోజులకు గాను హిందీ వెర్షన్ 102 కోట్లను వసూలు చేసింది. రెండు రోజుల తరువాత రాబట్టే వసూళ్లు ఇక లాభాల కిందకే వస్తాయని అంటున్నారు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ స్థాయి వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. మొత్తానికి ఈ సినిమా ప్రభాస్ స్టామినాను చాటి చెప్పిన చిత్రంగా నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more