Anushka makes cameras click at shamshabad airport ఎయిర్ పోర్టులో కెమెరాలను క్లిక్ మనిపించిన అనుష్క

Anushka makes cameras click at shamshabad airport

Anushka Shetty new look, Anushka at rajiv gandhi airport, anushka new look viral on net, anushka shetty, south indian actress, new look, prabhas, bahubali, viral online, Tollywood, movies, entertainment

Popular south indian Actress Anushka Shetty has been spotted at Shamshabad Airport in Hyderabad with a new look, which have gone viral online.

ఎయిర్ పోర్టులో కెమెరాలను క్లిక్ మనిపించిన అనుష్క

Posted: 09/04/2019 06:34 PM IST
Anushka makes cameras click at shamshabad airport

సూపర్ చిత్రం నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. దక్షిణాదిలోనూ తన సత్తా చాటి.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి యువతలో క్రేజ్ ఏర్పర్చుకున్న నటి అనుష్క శెట్టి. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి అటు ఫ్యామిలీ అడియన్స్ తో పాటు మహిళా ప్రేక్షకుల్లో కూడా చెరగని ముద్రవేసుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రభాస్ తో డేటింగ్ లో వున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినా.. అమె పెద్దగా పట్టించుకోలేదు.

ఇక సినిమాల్లో బిజీగా వున్న రోజుల్లో మీడియాతో సన్నిహితంగా వున్న అమె.. తనకు అవకాశాలు రాకపోవడంతో అమె మీడియాకు కూడా దూరంగానే వుంటోంది. అయితే అడపా దడపా కెమెరాలకు చిక్కుతుందీ అమ్మడు. తాజాగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తళుక్కుమన్న అనుష్కను చూసి.. అక్కడున్నవారు కెమెరాలను క్లిక్ మనిపించారు. ఇక అమె ఫోటోలు నెట్టింట్లోనూ ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు.

అనుష్క లుక్ అసలు బాగాలేదని, ఆమె గ్లామరస్ గా కనిపించలేదని, లావు ఇంకా తగ్గలేదని కామెంట్స్ వస్తున్న తరుణంలో అమె న్యూ లుక్ చూసిన నెటిజనులు ఔరా.! ఇలా మారిపోయిందా.? అంటూ నివ్వెరపోతున్నారు. అమె న్యూ లుక్ కూడా పెద్దగా గ్లామరెస్ గా లేదని నెట్ జనుల టాక్. 'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా లావెక్కిన అనుష్క, ఆపై బరువు తగ్గేందుకు ఎంతగా శ్రమించినా, మునుపటి లావణ్యాన్ని పొందలేకపోయిందన్న కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ భామ 'సైలెన్స్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలోనూ ఆమె లుక్ నిరాశ పరుస్తుందనే అంటున్నారిప్పుడు ఫ్యాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Shetty  south indian actress  new look  prabhas  bahubali  viral online  Tollywood  

Other Articles