‘meeku matrame chepta’ first look revealed దేవరకొండ నిర్మాణంలో ‘మీకు మాత్రమే చెప్తా’.. ఫస్ట్‌లుక్.!

Vijay deverakonda s meeku matrame chepta title is catchy

Meeku Matrame Chepta, Vijay Deverakonda, Meeku Matrame Chepta, director Tharun Bhascker, Shameer Sultan, Tollywood, Movies, Entertainment

Tollywood's present sensation Vijay Deverakonda is venturing into new waters as he kicks off his production house King Of The Hills Entertainments. With the aim to encourage new cinema and to give a boost to young talent.

దేవరకొండ నిర్మాణంలో ‘మీకు మాత్రమే చెప్తా’.. ఫస్ట్‌లుక్.!

Posted: 08/29/2019 09:25 PM IST
Vijay deverakonda s meeku matrame chepta title is catchy

తెలుగు యువతలో మంచి క్రేజ్ ఏర్పర్చుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తాను నిర్మితగా వ్యవహరిస్తూ రూపొందుతున్న తొలి సినిమా టైటిల్ ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ ని విడుదల చేసేశారు. ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లుక్‌లో తరుణ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఫోన్‌ పట్టుకుని ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంది.

పోస్టర్‌ పైన ‘మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్’ అని రాసుంది. అంటే వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా ఫన్నీగా ఉండబోతోందేమోనని తెలుస్తోంది. ఏదేమైనా విజయ్ హీరోగానే కాకుండా ఈ సినిమాతో మంచి నిర్మాతగా కూడా విజయం సాధించేలా ఉన్నాడు. సినిమా టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేశారు దేవరకొండ. ఇక సినిమా ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పనవసరం లేదు. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం లేదని తెలుస్తోంది. బహుశా ఆయన అతిథి పాత్రలో కనిపించవచ్చని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు నటీనటులు తాము నిర్మించే సినిమాల్లో తామే నటిస్తున్నారు. మరి విజయ్ ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతారా... లేక కేవలం నిర్మాతగా పెట్టుబడి మాత్రమే పరిమితం అవుతారా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles