మాస్ మహారాజ్ రవితేజ తన ఆశలన్నీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న డిస్కోరాజా చిత్రంపైనే పెట్టుకున్నారు. రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోని బాక్సాఫీసు వద్ద ఎలాంటి సవ్వడి చేయకుండానే వెళ్లిపోయింది. దీంతో డిస్కో రాజా తప్పకు హిట్ కావాలని తన అంచనాలు, ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు రవితేజ.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాన్ని అద్బుతంగా రూపొందించి హిట్ ఇచ్చిన దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వం కూడా రవితేజకు కలసివస్తుందని మాస్ మహారాజ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది.
'వినాయక చవితి' పండుగ సందర్భంగా, వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టుగా సమాచారం. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో దర్శకుడు వీఐ ఆనంద్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో లభిస్తుందో లేదో చూడాలి.
To All MassMaharaj Fans out there..
— SRT Entertainments (@SRTmovies) August 28, 2019
We are Happy to Announce That, First Look of #DiscoRaja On Sept 2nd on the eve of #VinayakaChavithi #DiscoRajaFLOnSept2nd@RaviTeja_offl @starlingpayal @vennelakishore @Tanyahopeoffl @NabhaNatesh @Dir_Vi_Anand @MusicThaman @itsRamTalluri
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more