మాస్ మహారాజ్ రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోని బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో.. తన ఆశలన్నీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న డిస్కోరాజా చిత్రంపైనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో తన అభిమానులకు వినాయక చవితి కానుకను అందిస్తానని చెప్పిన రవితేజ.. ఇక అదే ఊఫులో అభిమానుల ముందుకు డిస్కోరాజాగా ఎప్పుడు వస్తానన్న తేదీని కూడా స్పష్టం చేశారు.
విభిన్న కథలతో డిఫరెంట్ కదాంశంతో చిత్రాలను తెరకెక్కించే వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాన్ని అద్బుతంగా రూపొందించి హిట్ ఇచ్చిన దర్శకుడిపైనే ఇప్పుడు రవితేజ గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ కథ కూడా పూర్తి వైవిధ్యభరితమైనదనే టాక్ వినిపిస్తోంది.
చాలావరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్ర్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తితో అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ హీరోగా రవితేజ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more