Stylish Star in 'Ala Vaikuntapuramlo' అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.!

Allu arjun trivikram film titled ala vaikuntapuramlo

Ala Vaikuntapuramlo, Stylish Star Allu Arjun, Tollywood, Pooja Hegde, director Trivikram Srinivas, Tabu, Sushanth, Sathyaraj, Nivetha Pethuraj, Tollywood, Entertainment, movies, Bollywood

After scoring the biggest disaster with 'Naa Peru Surya Naa Illu India' movie, Stylish Star Allu Arjun joined hands with star director Trivikram Srinivas and is all set to come up with yet another romantic entertainer.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.!

Posted: 08/16/2019 05:23 PM IST
Allu arjun trivikram film titled ala vaikuntapuramlo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం గురించి అభిమానులకు తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నా పేరు స్యూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం అనుకున్న స్థాయిలో బాక్సాఫీసు వద్ద సవ్వడి చేయలేకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్న తరువాత బన్నీ ఈ చిత్రానికి ఓకే చెప్పారు.

అల్లు అర్జున్ కి సంబంధించి 19వ సినిమా కావడంతో దీనిపై అభిమానులు, సినీవర్గాల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కథ, కథనం మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తుండటంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగేందుకు కారణమయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సనాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాఫిసు వద్ద సంచలన విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా మరో సినిమా టైటిల్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రకటించింది. టైటిల్ కు సంబంధించి ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో బన్నీ కొత్త లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ala Vaikuntapuramlo  Allu Arjun  Pooja Hegde  Trivikram Srinivas  Nivetha Pethuraj  Tollywood  

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh