AA19 Title will be revealed on August 15th అభిమానులకు పంద్రాగస్టున అల్లు అర్జున్ కానుక..!

Aa19 title will be revealed on august 15th

Allu arjun, Trivikram Srinivas, AA-19 movie, Title, Fans, Surprise, Trivikram Allu Arjun, AA19 Trivikram Title, August 15th, Nivetha Pethuraj Tollywood, Bollywood, Entertainment, Movies

After the debacle of “Naa Peru Surya Naa Illu India” Stylish star, Allu Arjun had taken much more care about his films. His new film with Trivikram had started a few months back and the shooting in progress.

అభిమానులకు పంద్రాగస్టున అల్లు అర్జున్ కానుక..!

Posted: 08/13/2019 09:12 AM IST
Aa19 title will be revealed on august 15th

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే టైటిల్స్ వినిపించిన విషయం తెలిసిందే.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Trivikram Srinivas  AA-19 movie  Title  Fans  Surprise  Tollywood  

Other Articles

 • Siima 2019 awards rangasthalam keerthy suresh kgf win big

  'సైమా' అవార్డులు: రంగస్థలం, మహానటి చిత్రాలకు అవార్డుల పంట..

  Aug 16 | దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రామ్ చరణ్, సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' దుమ్మురేపింది. మొత్తం 9 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రామ్ చరణ్,... Read more

 • Allu arjun trivikram film titled ala vaikuntapuramlo

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.!

  Aug 16 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం గురించి అభిమానులకు తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.... Read more

 • Sye raa making video chiranjeevi film has grandeur written all over it

  మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

  Aug 14 | స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డీ రూపోందిస్తున్న చారిత్రాత్మక చిత్రం. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 152వ చిత్రంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మెగా... Read more

 • Rajinikanth akshay kumar film 2 0 gets a new release date in china

  చైనాలో రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రభంజనం

  Aug 14 | తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమాను ఆయన అభిమానులను రుచించలేదనే చెప్పాలి. ఈ చిత్రం విడుదలకాగానే డివైడ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందడానికి... Read more

 • Akshay kumar zeitgeist while phone rings during media meet

  మీడియా మీట్ లో ఫోన్ మోగితే.. అక్షయ్ ఆన్ లైన్..

  Aug 14 | బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కు సమయస్ఫూర్తి ఎక్కువని.. దాంతో పాటుగా హాస్య చతురత కూడా అదికమన్న విషయం తెలిసిందే. ఇలాంటి హాస్యానికి వెళ్లిన ఆయన తన సహచరి సోనాక్షి చేతిలో పరాభవానికి కూడా... Read more

Today on Telugu Wishesh