Fiesty Kangana Ranaut goes all guns blazing యాక్షన్ చిత్రంలో మెరువనున్న కంగన రనౌత్

Fiesty kangana ranaut goes all guns blazing

dhaakad, dhaakad teaser, dhaakad first look teaser, kangana ranaut in dhaakad, kangana ranaut latest, dhaakad teaser out, Tollywood, Bollywood, Entertainment, Movies

Kangana Ranaut is ready to take on the big screen, in a new avatar. After trying her hands at various genres in the last one decade, Kangana will now be seen in an actioner - Dhaakad.

యాక్షన్ చిత్రంలో మెరువనున్న కంగన రనౌత్

Posted: 08/10/2019 06:58 PM IST
Fiesty kangana ranaut goes all guns blazing

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ తన యాక్షన్‌తో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ‘sÁaడ్జిమెంటల్‌ హై క్యా’ తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ‘ధాకడ్‌’. రజనీష్‌ రాజి ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో కంగన ఓ యాక్షన్‌ హీరోయిన్‌ అవతారంలో కనిపించి, మెప్పించారు.

ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. కంగన చేతిలో తుపాకీ, గాయాలతో చాలా డ్యాషింగ్‌గా ఉన్నారు. చివరిలో ఆమె చూసిన చూపు టీజర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ చిత్రం టీజర్‌ గురించి కంగన మాట్లాడుతూ.. ‘టీజర్‌లో మేం ఉపయోగించిన తుపాకీ నిజమైంది, అది చాలా బరువుగా ఉంటుంది. ఒక్కదాన్ని పైకెత్తాలంటే నా శక్తినంతా కూడగట్టుకునేదాన్ని. నేను ఆ తుపాకీలతో కష్టపడుతుంటే డైరెక్టర్‌ చూసి నవ్వుకునేవారు. ఇకనైనా డమ్మీ తుపాకీలతో షూటింగ్‌ చేయించాలని ఆశిస్తున్నానని’ నవ్వుతూ చెప్పారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhaakad  teaser  Theatrical trailer  kangana ranaut  Tollywood  Bollywood  

Other Articles