Keerthy Suresh wins National Film Award for Best Actress జాతీయ అవార్డులలో తెలుగుచిత్రాల పాంచ్ పటాకా.!

Keerthy suresh wins best actress national film award for mahanati

national cinema awards, telugu movies, best regional actress, keethi suresh, mahanati, best audiography, rangasthalam, best special effects movie, Aa, best screenplay, chi la sow, entertainment, movies, tollywood

Keerthy Suresh’s portrayal of legendary actor Savitri in the bilingual biopic Mahanati on Friday helped her bag the National Film Award for Best Actress.

జాతీయ అవార్డులలో తెలుగుచిత్రాల పాంచ్ పటాకా.!

Posted: 08/09/2019 07:53 PM IST
Keerthy suresh wins best actress national film award for mahanati

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రసీమకు చెందిన నాలుగు చిత్రాలు ఐదు అవార్డులను అందుకున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. ప్రాంతీయ కోటాతో పాటు జాతీయ స్థాయిలో పోటీపడి మరీ తెలుగు చిత్రాలు అవార్డులను అందుకున్నాయి.

అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు. దర్శకుడు రాహుల్‌ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి||ల||సౌ||’ చిత్రాలకు అవార్డులు దక్కాయి.

* ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
* ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
* ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)
* ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)
* ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)

* ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
* ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో
* ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)
* జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌

* జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
* జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
* జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
* ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)
* జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌
* ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

* ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం:  చి||ల||సౌ||
* ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)
* ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ మేకప్‌: ‘అ!’
* ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి
* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)

* ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
* ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
* ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
* ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
* ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
* ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే
* నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : national cinema awards  telugu movies  mahanati  rangasthalam  Aa  chi la sow  tollywood  

Other Articles