సినిమా షూటింగుల్లో అందరితో సరదాగా ఉంటూ.. తనదైన శైలిలో తోటి నటులను ఆటపట్టించే నైజం అక్షయ్ కుమార్ ది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా తోటి నటి పన్నిన సరదా పన్నాగంలో అక్షయ్ పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మిషన్ మంగళ్’. ఆ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో ప్రముఖ హీరోయిన్లు నిత్యామీనన్, తాప్సి, విద్యాబాలన్, కీర్తి కుల్హరి పాల్గొన్నారు.
వీరంతా కూర్చొని చిత్రానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. పక్కనే ఉన్న సోనాక్షి.. దీన్ని అదునుగా భావించి అక్షయ్ ఛాతిపై చేత్తో కొట్టింది. దీంతో అక్షయ్ కుర్చీతో పాటు వెనక్కి పడిపోయాడు. అతను పడిపోతుండగా తాప్సి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్షయ్‌ని చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురవగా.. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది.
‘‘నాకు ఎవరైనా చిరాకు తెప్పిస్తే నేను ఇలాగే ప్రవర్తిస్తాను’’ అని నవ్వూతూ వివరణ కూడా ఇచ్చింది. అక్షయ్ సైతం దీన్ని సరదాగా తీసుకొని సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటిది? అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ పెట్టడంతో మిగతావారూ నవ్వడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘అప్పుడు వారందరి ముఖాలు చూడాల్సింది’ అనే ట్యాగ్‌లైన్‌తో సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ మంగళ్’. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్‌యాన్’ మిషన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో నటి విద్యా బాలన్ శాస్త్రవేత్తల బృందానికి అధికారిణిగా కనిపించనున్నారు. తాప్సి, నిత్యా మేనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జగన్ శక్తి దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది.
Sona, your laugh @sonakshisinha and @akshaykumar these two are so adorable
— Kay. (@RAslisona) August 9, 2019
Credits video by @sonamyheartbeat #SonakshiSinha #AkshayKumar #MissionMangal pic.twitter.com/bebhZxEj1B
(And get your daily news straight to your inbox)
Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more
Dec 11 | అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more
Dec 10 | మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్... Read more
Dec 10 | ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన... Read more
Dec 10 | దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ... Read more