Rakhi Sawant Confirms Marrying NRI ఔను.. నిజమే.. పెళ్లి చేసుకున్నాను: రాఖీ సావంత్

Rakhi sawant secret wedding trns true confirms bold actress

rakhi sawant, rakhi sawant married, rakhi sawant secret marriage, rakhi sawant husband, rakhi sawant married nri, rakhi sawant secretly marries nri, rakhi sawant wedding, rakhi sawant husband photo, rakhi sawant wedding jw marriott, rakhi sawant controversies, rakhi sawant news, rakhi sawant latest, entertainment, movies, bollywood

Rakhi Sawant, who had earlier posted pictures of herself wearing bridal bangles, henna on her hands and vermillion on her forehead, has finally admitted that she has recently tied the knot with a UK-based NRI business in a private ceremony.

ఔను.. నిజమే.. పెళ్లి చేసుకున్నాను: రాఖీ సావంత్

Posted: 08/07/2019 11:51 AM IST
Rakhi sawant secret wedding trns true confirms bold actress

బాలీవుడ్ హాట్ బ్యూటీగా, ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ పై అమె అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు బోల్గ్ నటనతో కాంట్రావర్సీలకు కేరాఫ్ గా మారిన నటి రాఖీ సావంత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఎన్నారైని పెళ్లాడినట్టు జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాఖీ పెళ్లికుమార్తె డ్రెస్‌లో ఉన్న ఫొటోలను కూడా ప్రచురించాయి.

బోల్డ్ బ్యూటీ ఓ ఇంటిదయ్యిందన్న వార్త మీడియాలో వస్తే.. తూచ్ అదంతా తప్పు.. ఆ వార్తల్లో నిజంలేదని.. కేవలం జేడబ్యూ మారియట్ హోటల్ పెళ్లికూతురు వేషంలో ఫోటో షూట్ నిర్వహిస్తున్నందున తాను అలా తయారయ్యానని, అది కేవలం ఫోటో షూట్ మాత్రమేనని తోసిపుచ్చింది. దీంతో అభిమానులు సంతోషించారు. తమ బోల్డ్ నటికి ఇంకా వివాహం కాలేదని.. కలల ప్రపంచంలో మునిగిపోతున్నారు.

అయితే తాజాగా అమె తన అభిమానులకు పిడుగులాంటి వార్తను చెప్పింది. అదేంటంటే తాను పెళ్లి చేసుకున్నానని, దీంతో అభిమానులు అమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాదు తన భర్త వివరాలను కూడా చెప్పింది. యూకేలో ఉన్న ఎన్నారై బిజినెస్ మెన్ రితీశ్ ను పెళ్లాడానని ఆమె ప్రకటించింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది.

పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని... వీసా కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పింది. రితీశ్ తన అభిమాని అని తెలిపింది. ప్రభు చావ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సమయంలో అతను తనను మొదటి సారి చూశాడని... ఆ తర్వాత వాట్స్ యాప్ ద్వారా మెసేజ్ పంపాడని రాఖీ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని... ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని తెలిపింది. ఇంత మంచి భర్తను తనకు ఇచ్చినందుకు జీసస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది.

సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని తెలిపింది. 2020 కల్లా ఓ బిడ్డకు తల్లి కావాలనేది తన కోరిక అని రాఖీ చెప్పింది.  అందులోనూ తన అభిమానిగా వున్న ఓ ఎన్ఆర్ఐ వ్యక్తినే తాను పెళ్లి చేసుకున్నానని అమె తెలిపారు. దీంతో ఇప్పుడీ హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ అభిమానులు ఖంగుతిన్నారు. ఒక్క అభిమానికి న్యాయం చేస్తే మరి మా పరిస్థితి ఏంటీ అని అన్నట్లుంది వారి వాదన. హద్దులు మీరిన అభిమానం వుంటే దెబ్బలు తప్పవుగా మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakhi sawant  marriage news  secret marriage  nri  wedding  bridal dress  jw marriott bridalshoot  bollywood  

Other Articles

 • Darling prabhas a very happy birthday

  డార్లింగ్ జన్మదిన సంబరాలు..

  Oct 23 | అరడుగుల అజానుభావుడు కృష్ణంరాజు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మన తెలుగు నేల పై సుస్వరరాగలను వెదజల్లుతున్నా శివాగమి ముద్దుబిడ్డ ప్రభాస్... నటనలో వైవిధ్యం.. చలనచిత్రానికై ఏకాగ్రత..పట్టువిడని తనం.. ఆదనపు ఆకర్షణలు.. ఏ పాత్రలోనైన ఇమిడిపోయే... Read more

 • Komaram bheem jayanti rrr buzzing

  కొమరం భీం జయంతి - RRR సందడి

  Oct 22 | నిజాం సర్కార్  నిరంకుశతత్వాన్నికి    ఎదురుతిరిగి నిలబడిన మన తెలంగాణ వీరుడు కొమరం భీం.. అటువంటి చరిత్రకారుడు చరిత్ర వింటేనే  మది  పులకిస్తుంది . మరి కళ్ళకు కు  కట్టినట్టు  దర్శనం ఇస్తే మన  రెండు... Read more

 • Samantha akkineni shares an adorable picture of hubby naga chaitanya with their pet dog

  అందాల మనం ప్రేయసి - శునకాల ప్రేయసి

  Oct 22 | మనకందరికీ  ఎంతో ప్రియమైన సుపరిచితురాలైనా  మన తెలుగు బంగారపు బొమ్మ ....అక్కినేని వంశ రారాణి  మన సమంతా ..చైతన్య సమంత జంటను  చూసి ముచ్చటపడని  వారున్నారంటే  అతిశయోక్తే  మరీ  ..అంతగా ఇమిడిపోయారు ఇరువురు మనం... Read more

 • Megastar chiranjeevi meets vice president m venkaiah naidu in new delhi

  ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

  Oct 16 | మెగాస్టార్ చిరంజీవి చిత్రం రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన స్వయంకృషితో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తరుణంలో అనేక అటుపోట్లను చూసినా.. ఏ రోజు తన చిత్రాన్ని వీక్షించాలని ఏ రాజకీయ నేతనూ కోరలేదు.... Read more

 • Housefull 4 s bhoot song has nawazuddin siddiqui chanting alia bhatt

  హౌజ్ ఫుల్ 4 నుంచి ‘హాంఫట్.. అలియా భట్’ వీడియో సాంగ్..

  Oct 16 | ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ విడుదలకు సిద్ధమవుతుంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా నటించగా.. ఫర్హాద్... Read more

Today on Telugu Wishesh