వచ్చే సంవత్సరం ఇదే రోజున ఏం జరుగుతుంది? ఇవాళ్టి తేదీకి ఏమిటా ప్రత్యేకం. ఆ విషయానికి వస్తే ఇవాళ తేదీ ఏంటీ.? అంటారా.. ఇవాళ 30 జూలై 2019. ఇలా అడిగితే రేపు ఏం జరుగుతుందన్నది ఎవరమూ చెప్పలేము. మరి ఏడాది తరువాత ఏం జరుగుతుందంటే ఎవరు మాత్రం చెప్పగలరు. అయితే వచ్చే సంవత్సరం సరిగ్గా 30 జూలై 2020 ఏం జరుగుతుందో చెప్పేశాడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్.
2020 జూలై 30న భారత సినీ రంగం గర్విస్తుందని అన్నాడు. ఎన్టీఆర్, తను హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో నిర్మితమవుతున్న 'ఆర్ఆర్ఆర్' (వర్కింట్ టైటిల్) సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఆలియా భట్ కాగా, మరో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. సినిమా వచ్చే సంవత్సరం ఇదే రోజున విడుదల అవుతుందని చెబుతూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ఇప్పటి నుంచే సంబరాలు మొదలు పెట్టారు.
Indian Cinema is Going to be Very Proud #RRR #AlluriSitaRamaRaju - #RamCharan #KomaramBheem - @tarak9999 #1YeartoGoForRRR @ssrajamouli @RRRMovie @DOPSenthilKumar @DVVMovies @upasanakonidela pic.twitter.com/OUDTDHM6c8
— Cinema Basket™ (@CinemaBasket) July 30, 2019
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more