పోటాపోటీగా తీవ్ర ఉత్కంఠల నడుమ సాగిన ఫిలించాంబర్ ఎన్నికల్లో సి. కల్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానెల్' వర్గం ఘనవిజయం సాధించింది. 12 మంది ఈసీ మెంబర్స్ లో 'మన ప్యానెల్' తరఫున 9 మంది విజయం సాధించగా, ప్రత్యర్థి వర్గం 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ' ప్యానెల్ లో కేవలం దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ మాత్రమే గెలిచారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగిన మోహన్ గౌడ్ కూడా విజయం సాధించారు.
ఇక, 20 మంది సెక్టార్ మెంబర్స్ లో 'మన ప్యానెల్' హవా కొనసాగింది. సి కళ్యాణ్ కు చెందిన మన ప్యానెల్ నుంచి 16 మంది గెలుపొందగా, దిల్ రాజుకు చెందిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ తరఫున నలుగురు మాత్రమే విజయం సాధించారు. 'మన ప్యానెల్' నుంచి వైవీఎస్ చౌదరి, నట్టి కుమార్, మోహన్ వడ్లపట్ల, ఎం.శివకుమార్, కేశవరావు, సాగర్ తదితరులు పోటీ చేశారు. 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్' ప్యానెల్ తరఫున దిల్ రాజు, డీవీవీ దానయ్య, పోటీ చేశారు.
వీరితో పాటు కొర్రపాటి సాయి, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, ఆచంట గోపీనాథ్, కేకే రాధామోహన్, శివలెంక కృష్ణప్రసాద్, భోగవల్లి ప్రసాద్ తదితరులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది. ఫిలిం చాంబర్లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోంది.
గత కొన్నేళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయం మేరకు ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎగ్జిబిటర్స్ విభాగం నుంచి నారాయణ దాస్ నారంగ్‌ను ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్లుగా దిల్ రాజు, ముత్యాల రామదాసులను, సెక్రటరీగా దామోదర్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా నట్టికుమార్, భరత్ చౌదరిలు, ట్రెజరర్ గా విజయేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు.
(And get your daily news straight to your inbox)
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more