Ismart Shankar clocked Rs. 63 mark ! రూ. 63 కోట్లను రాబట్టిన పూరి ఇస్మార్ట్ శంకర్

Ismart shankar day 9 collections ram pothineni unstoppable at box office

Ismart Shankar, puri jagannath, Ram potheneni, Charmee, Rs 50 cr club, mani sharma, nabha natesh, niddhi, ismart shankar collections, ismart shankar box office, dear comrade, entertainment, movies, tollywood

Puri Jagannath has made his film ‘Ismart Shankar’ as Ram starrer. Released on the July 18th, the film has been well received by the audience. Co-producer and Actress Charmee has tweeted that the film has grossed over Rs 63 crore on day 9.

రూ. 63 కోట్లను రాబట్టిన పూరి ఇస్మార్ట్ శంకర్

Posted: 07/27/2019 05:11 PM IST
Ismart shankar day 9 collections ram pothineni unstoppable at box office

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్.. యంగ్ హీరో రామ్ పోతినేనితో కలసి తన మార్కు మాస్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ను తీసి బంఫర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా వ్యక్తి మెదడును మార్పిడి చేయడమనే కాన్సెప్ట్‌తో రూపొందిందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్ర్కిప్ట్ విషయంలోనూ పలు అరోపణలు వచ్చినా.. వసూళ్లలో మాత్రం దాని ప్రభావం కనిపించడం లేదు.

ఈ నెల 18వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద సవ్వడే చేస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూ వస్తోంది. రామ్ మాస్ డైలాగ్స్ .. మాస్ బీట్స్ .. హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమా వసూళ్లలో ప్రధానమైన పాత్రను వహిస్తున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలైన 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఈ విషయాన్ని చార్మీ స్వయంగా తెలియజేసింది. అంతేకాదు వసూళ్లకు సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్ల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి 'ఇస్మార్ట్ శంకర్' ఒక రేంజ్ లో దుమ్ము దులిపేస్తూ వస్తున్నాడు. మరి ఈ సినిమా వసూళ్లపై 'డియర్ కామ్రేడ్' ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి మరి. 9 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. పూరి మాస్ డైలాగులు .. రామ్ నటన - డాన్స్ .. మణిశర్మ మ్యూజిక్.. నభా - నిధి గ్లామర్ ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ismart Shankar  puri jagannath  Ram potheneni  Charmee  Rs 50 cr club  tollywood  

Other Articles