Alia Bhatt is the Times Most Desirable Woman of 2018 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అలియా భట్

Alia bhatt is the times most desirable women of 2018

Entertainment News, Bollywood News, Hindi Movies News, gorgeous, Diva, Desirable woman, Bollywood, alia bhatt, online voting, times magazine, tollywood, movies, entertainment

Alia Bhatt grabs the top spot this year. At 26, the actress is considered a powerhouse of talent, not only by her contemporaries, but thespians of the film industry.

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అలియా భట్

Posted: 05/24/2019 07:24 PM IST
Alia bhatt is the times most desirable women of 2018

వెండితెరపై కొంత కాలం సందడి చేసి తెరమరుగైన నటిమణులెందరో.. అభినయంతో పాటు అదృష్టం కూడా కలసివస్తేనే స్టార్ హీరోయిన్లుగా స్థిరపడతారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ తెరపై సందడి చేస్తూ.. దానిని కొనసాగిస్తున్న అందమైన భామలలో అలియా భట్ ఒకరు. టీనేజ్ లోనే కథానాయికగా తెరపైకి వచ్చేసిన అలియా, కుర్రకారు హృదయాలను తన గుప్పెట్లోకి లాగేసుకుంది. అటు గ్లామర్ పరంగాను .. ఇటు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది.

వరుస అవకాశాలతో పాటు, వరుస విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్ తెరపై వెలిగిపోతున్న ఈ నటి ఖాతాలోకి అరుదైన ఘనత వచ్చి చేరింది. అందంతో పాటు అభినయం.. దానితో పాటు అనుకువ.. అన్నింటినీ సమపాళ్లలో కలగలపితే మూర్తీవభించే రూపంలా అలియా. అందుకే కాబోలు అమెను వెతుక్కుంటూ ఈ అరుదైన ఘనత వచ్చి చేరింది. ఇప్పటికే పలు అవార్డులు అమె తన ఖాతాలో వేసుకోగా, తాజాగా టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్'గా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

బాలీవుడ్ తెరపై టాప్ హీరోయిన్స్ గా తమ హవాను కొనసాగిస్తున్నవారిని సైతం వెనక్కి నెట్టేసి ఆమె ఈ టైటిల్ కొట్టేయడం విశేషం. మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి.. ఆ తరువాత కత్రినా కైఫ్.. ఆ వెనుక దీపికా పదుకొనె, గాయత్రి భరద్వాజ్, అదితీరావు హైదరి, జాక్విలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, అనుకృతి తదితరులు వున్నారు. ప్రస్తుతం అలియా తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' .. హిందీలో 'బ్రహ్మాస్త్ర' .. 'సడక్ 2' సినిమాలు చేస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diva  gorgeous  Desirable woman  alia bhatt  online voting  times magazine  Bollywood  

Other Articles