ఇండస్ట్రీలో ఇంకా క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఇది బయటికి కనిపిస్తుంది.ఇక బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ప్రారంభించిన ఈ క్యాష్టింగ్ కౌచ్ ఉద్యమం సౌత్ ప్రముఖ గాయని చిన్మయి ముందుండి పోరాడుతోంది. అప్పట్లో ఓ స్కామ్‌లో ఇరుక్కుని న్యూడ్ వీడియోలు కూడా బయటికి రావడంతో చాలా ఇబ్బంది పడింది చిన్మయి. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు కూడా తాను ఎదుర్కొన్నానని చెప్పి సంచలనం సృష్టించింది.
మీటూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి, ప్రముఖ రచయిత వైరముత్తు మధ్య వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా చిన్మయి మాత్రం ఒంటరిగా ఎదుర్కొంటోంది. చిన్మయి చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎదురవుతున్న సమస్యల గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా చిన్మయిని తన ట్విట్టర్ ఫాలోవర్ అడిగిన రిక్వెస్ట్ అందుకు ఆమె చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా అమె ట్వీట్ వుందని నెట్ జనులు ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో చిన్మయిని ఓ వ్యక్తి న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు. అతడు అడిగినట్లుగానే న్యూడ్ పిక్స్ పంపింది. కానీ అవి అతడు కోరుకున్న ఫోటోలు కాదు. నాకు నచ్చిన న్యూడ్ పిక్స్ ఇవే అంటూ చిన్మయి లిప్ స్టిక్ ఫోటోలు షేర్ చేసింది. హ్యూమన్ స్కిన్ కలర్ లో ఉండే కొన్ని లిప్ స్టిక్స్ ని న్యూడ్ లిప్ స్టిక్స్ అని పిలుస్తారు. ఆ దృశ్యాలని చిన్మయి అతడికి షేర్ చేసింది. దీనితో చిన్మయి సమాధానానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతడితో జరిగిన సంభాషణని చిన్మయి ట్విటర్ లో షేర్ చేసింది.
In the meanwhile.. for some entertainment pic.twitter.com/JwarkEaKDz
— Chinmayi Sripaada (@Chinmayi) May 20, 2019
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more