మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ అటు నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్లో.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న రెండో చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో రూ. 2 కోట్ల మేర అస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ ఘటనపై రాంచరణ్ తేజ్ తన ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. ‘దురదృష్టవశాత్తు ‘సైరా’ సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన కోకాపేట్లో చోటుచేసుకుంది. అదృష్టం బాగుండి ఈ ఘటనలో చిత్రబృందంలోని ఎవ్వరికీ ఏమీ కాలేదు.
అగ్ని ప్రమాదం అనగానే కాసింత అందోళనకు గురైనా.. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నాను. త్వరలో ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేయాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తు్న్నారు.
ఈ చిత్రంలో భారీ తారాగణం వున్న విషయం తెలిసిందే. నటనాభినేత్రి నయనతార.. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రను పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more