Naresh fires on Shivaji Raja శివాజీ రాజా కామెంట్లను ఖండించిన నరేష్..

Naresh condemns shivaji raja comments on nagababu

naresh, shivaji raja, insensitive comments, jeevitha, maa, Movie Artist Association, Nagababu, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Movie Artist Association (MAA) president actor Naresh, condemns the insensitive comments made by shivaji raja on Nagababu. Naresh said, “Shivaji Raja has no right to make such comments on Naga Babu.

శివాజీ రాజా కామెంట్లను ఖండించిన నరేష్..

Posted: 05/03/2019 08:53 PM IST
Naresh condemns shivaji raja comments on nagababu

నటుడు శివాజీరాజా.. మెగా బ్రదర్ నాగబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ పేర్కొన్నారు. శివాజీ రాజా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని అన్నారు. ‘మా’ కుటుంబం కోసం మంచి చేయాలని భావిస్తున్న వారికి అండగా నిలబడకపోయినా పర్వాలేదు కానీ.. తూలనాడటం సహేతుకం కాదని అన్నారు. ఏదైనా మనం కూర్చుని మాట్లాడుకోవాలి. అంతేకానీ మీడియా దగ్గరికి వెళ్లి మాట్లాడటం సరికాదు. అనవసర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నామని అని అన్నారు.

నాగబాబు, శివాజీ.. ఇద్దరూ ‘మా’ మాజీ అధ్యక్షులు. వ్యక్తిగతంగా కామెంట్లు చేయొద్దు. నాగబాబుపై శివాజీ రాజా నోరుజారుతున్నారని, వ్యక్తిగతంగా కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇలాంటి ఇబ్బందికర పరిణామాలను సృష్టించడం ఎవరికీ మంచిదికాదని అన్నారు. నాగబాబు తన అధ్యక్షుడిగా కొనసాగిన హాయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని నరేష్ గుర్తుచేశారు.

‘మా’కు సంబంధించిన విషయాలను పబ్లిక్ లోకి తీసుకురావద్దని నరేష్ కోరారు. నాగబాబు కుటుంబం ‘మా’కు రూ.6 లక్షలు విరాళంగా ఇచ్చిందని కూడా చెప్పారు. ఆయన్ను విమర్శించడం, తూలనాడటం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో నాగబాబు స్వయంగా వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. ‘మా’ను రక్షించుకుందాం.. ముందుకు పోదాం. ఇప్పటికైనా మనం అందరం కలిసి పనిచేద్దాం. నాగబాబుపై వచ్చిన కామెంట్లను తాను ఖండిస్తున్నా. ఇటువంటివి మళ్లీ జరగకుండా ఉంటే మంచిదని నరేష్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naresh  shivaji raja  insensitive comments  jeevitha  maa  Movie Artist Association  Nagababu  tollywood  

Other Articles