Will EC stop release of Lakshmi's NTR? ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు బ్రేక్.?

Ec urged to stop lakshmi s ntr till andhra elections

director ram gopal varma, ram gopal varma NTR BIopic, Lakshmi parvathi ntr biopic, ram gopal varma, lakshmi's NTR, director, Election commission, TDP, YSRCP, cine politics, tollywood, movies, entertainment

The Election Commission was Tuesday urged to stop the release of Telugu movie "Lakshmi's NTR" on the ground that this could impact the coming Lok Sabha and assembly elections in Andhra Pradesh.

ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు బ్రేక్.?

Posted: 03/12/2019 09:18 PM IST
Ec urged to stop lakshmi s ntr till andhra elections

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తన సినిమాల కన్నా.. తన సామాజిక మాద్యమంలో వివాదాస్పద పోస్టులు, వ్యాఖ్యలతోనే అధికంగా ప్రేక్షకుల నోటిలో నానుతూవున్నారు. ఇక తాజాగా ఆర్జీవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా నేపథ్యంలో ఆయన తొలిసారిగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుని ఆయన బయోపిక్ ను తెరపై రూపోందిస్తున్నారు.

స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ.. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపోందించిన ఎన్టీఆర్ కథనాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు బాగాలతో తన తండ్రి బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా.. అవి పెద్దగా ప్రేక్షకాదరణ పోందలేదు. ఈ క్రమంలో అర్జీవి దర్శకత్వంలో తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 అయితే ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఫిర్యాదు చేశారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని.. ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపిస్తుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని తన ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పరిశీలన కోసం పంపించింది. మార్చి 22న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  lakshmi's NTR  director  Election commission  TDP  YSRCP  cine politics  tollywood  

Other Articles