Rana Daggubati boosts Raj Tarun's career రానా పక్కన ఛాన్స్ కోట్టేసిన రాజ్ తరుణ్

Interesting combo rana daggubati and raj tarun

Rana Daggubati, bilingual film, Akshay Kumar, Rana Daggubati Akshay Kumar film, Rana Daggubati Raj Tarun, Raj Tarun, Bollywood actor, untitled film, Tollywood, Bollywood, movies, Entertainment

Rana Daggubati is going to bankroll a bilingual Telugu and Hindi an upcoming untitled film in partnership with Akshay Kumar. In it’s Telugu version Raj Tarun will play the lead role whereas he is planning to rope a Bollywood actor for Hindi version.

రానా పక్కన ఛాన్స్ కోట్టేసిన రాజ్ తరుణ్

Posted: 03/09/2019 09:03 PM IST
Interesting combo rana daggubati and raj tarun

ఆరంభంలో వరుస విజయాలను అందుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత సరైన కథలను ఎంచుకోకపోవడం వలన తగిన ఫలితాలనే అందుకున్నాడు. ఆయన సక్సెస్ అనే మాట విని చాలా కాలమే అయింది. వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథల కోసం వెయిట్ చేస్తూ ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల ఆయన దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా చెప్పుకున్నారు.

ఇక రానా సొంత బ్యానర్లోను ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనేది తాజా సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి తెలుగు .. హిందీ భాషల్లో ఓ మాదిరి బడ్జెట్ లో సినిమాలు చేయడానికి రానా రంగంలోకి దిగి కొంతకాలమైంది. తెలుగు వెర్షన్ కోసం రాజ్ తరుణ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కోసం హీరోను ఎంపిక చేయవలసి వుందట. వేసవి తరువాత ఈ  సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  bilingual film  Akshay Kumar  Raj Tarun  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh