nani to co-producer mohan krishna indraganti film తన సినిమాలకే నిర్మాతగా మారుతున్న నానీ.!

Nani to turn as co producer for mohan krishna indraganti movie

natural star Nani, mohan krishna indraganti, co producer, dil raju, producer, Nani co producer, movies, entertainment, tollywood

Natural star Nani is busy with his movies and now he wants to be busy turning as co-producer for mohan krishna indraganti movie.

తన సినిమాలకే నిర్మాతగా మారుతున్న నానీ.!

Posted: 02/21/2019 05:29 PM IST
Nani to turn as co producer for mohan krishna indraganti movie

న్యాచురల్ హీరోగా నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. త్వరలోనే 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఈ చిత్రంలో ఆయన కూడా కొంత పెట్టుబడి పెట్టేందుకు ఉద్యుక్తుడు అవుతున్నాడట నాని.

అదేంటీ అంటే.. ఈ చిత్రానికి సహ నిర్మాతగా నాని వ్యవహరించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నిర్మాతగా ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా సందీప్ రాజ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నట్టుగా సమాచారం. 'అ' సినిమా తరహాలో ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండనుందని అంటున్నారు. గతంలో నాని నిర్మించిన 'అ' సినిమా ఆశించినస్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆయన మళ్లీ నిర్మాతగా కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nani  dil raju  mohana krishna indraganti  co producer  prodution  tollywood  

Other Articles