F2 Fun and Frustration 10 days Collections వందకోట్ల క్లబ్ లోకి పరుగులు తీస్తున్న తోడల్లుళ్లు

F2 fun and frustration 10 days ap ts box office collections

F2 Fun and Frustration, F2 Fun and Frustration 10 days box office collections, F2 box office collections, Victory Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada, Dil Raju, latest movie news, kollywood, movies, entertainment

F2 Fun and Frustration is a comedy and romantic entertainer produced by Dil Raju, has minted Rs 47.12 Cr shares at the box office of both Telugu states- Andhra Pradesh and Telangana after the successful run of 10 days.

వందకోట్ల క్లబ్ లోకి పరుగులు తీస్తున్న తోడల్లుళ్లు

Posted: 01/22/2019 07:51 PM IST
F2 fun and frustration 10 days ap ts box office collections

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా జంటగా నటించిన పూర్తి హస్యభరిత వినోదాత్మక చిత్రం 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) వంద కోట్ల క్లబ్ లోకి పరుగులు పెడుతుంది. సంక్రాంతి అల్లుళ్లుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు పండించిన కామెడీని తెలుగు ప్రేక్షకులు బాగా అస్వాధిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలో పాత రికార్డులను చెరిపేస్తూ.. కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో 70కోట్ల గ్రాస్ ను వసూలు చేసి..  47 కోట్ల షేర్ ను రాబట్టిందీ సినిమా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా నిన్నటితో 90కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనేది ట్రేడ్ పండితుల అంచనా. ఇదే క్రమంలో ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా నిన్నటితో కలుపుకుని 16.09 కోట్ల షేర్ ను రాబట్టింది.

త్వరలోనే నైజాం ఏరియాలో 20 కోట్ల షేర్ మార్క్ ను అందుకుంటోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సీడెడ్ లో రూ. 6.10 కోట్లు, గుంటూరు రూ. 4.03 కోట్లు, తూర్పు రూ.5.44 కోట్లు, పశ్చిమ రూ.3.07 కోట్లు, కృష్ణా రూ.3.97 కోట్లు, నెల్లూరు రూ.1.48 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఏదేమైనా, కామెడీ కంటెంట్ కి తిరుగులేదనే విషయాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nani s v secret behind the killer drama s title revealed

  ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

  Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

 • Crucial action sequences of naarappa will be an added advantage

  నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

  Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

 • Varun tej s boxing film goes on floors to release on this date

  ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

  Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

 • Disha patani s bodyguard pushes photographer and gets into fight

  వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

  Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

 • Allu arjun heap praises on bheeshma double congrats nithiin for the success and marriage

  ‘భీష్మ’తో డబుల్ జోష్.. నితిన్ కు బన్ని మెసేజ్.!

  Feb 24 | హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం అంచనాలకు మించి బాక్కాఫీసు వద్ద దూసుకుపోతుండటంతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్ కు చక్కని సందేశం పంపారు. వరుసగా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న నితిన్..... Read more

Today on Telugu Wishesh