Ram Charan's VVR collects RS.60 Cr రూ.60 కోట్ల కలెక్షన్లు దాటిన ‘రామ’

Ram charan s vvr box office collections rs 60 cr

Vinaya Vidheya Rama, Vinaya Vidheya Rama box office collections, Vinaya Vidheya Rama 10 days collections, Ram Charan, boyapati srinu, box office collections, movies, entertainment, tollywood

According to the latest update, Vinaya Vidheya Rama has collected Rs 60.92 Cr shares at the Worldwide box office after the run of 10 days.

రూ.60 కోట్ల కలెక్షన్లు దాటిన ‘రామ’

Posted: 01/22/2019 06:08 PM IST
Ram charan s vvr box office collections rs 60 cr

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ‘వినయ విధేయ రామ’ పాజిటివ్ టాక్ అంతగా రాకపోయినా.. కలెక్షన్స్ మాత్రం రాబట్టిన చిత్రంగా నిలిచింది. మాస్ అడియన్స్ ను ఎప్పుడు నిరాశపర్చని యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను.. ఈ చిత్రంలోనూ మాస్ అడియన్స్ కోణంలోనే తీశారు. అయితే ఈ చిత్రంలో హింసకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో క్లాస్, ఫ్యామిలీ అడియన్స్ ను అకర్షించలేకపోయింది.

అయినా కలెక్షన్లలో మాత్రం సినిమా నిరాశపర్చలేదు. తొలిరోజు ఏకంగా రూ.26కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. అంతకుమించిన షాక్ ఏంటంటే ఈ సినిమా రెండో వారంలోనూ స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. చిత్రంలో ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్ లు మాస్ ప్రేక్షకులను అకర్షిస్తున్నాయి.

బోయపాటి భయపెట్టాడని చిత్రం విడుదలైన రోజునే నెగిటివ్ టాక్ వచ్చినా.. రాంచరణ్ నటనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని అభిమానులు చెబుతున్నారు. మాస్ అడియన్స్ చిత్రానికి బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.50కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. లాంగ్ రన్ లో మరో రూ.15కోట్ల రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinaya Vidheya Rama  Ram Charan  boyapati srinu  box office collections  tollywood  

Other Articles

Today on Telugu Wishesh