Total Dhamaal Official Trailer launched గంటల వ్యవధిలోనే టోటల్ ధమాల్ సంచలనం..

Total dhamaal official trailer wild wild best comedy

Total Dhamaal, theatrical trailer, adventure comedy film, Ajay Devgn, Riteish Deshmukh, Arshad Warsi, Javed Jaffrey, Madhuri Dixit, Esha Gupta, Anil Kapoor, Indra Kumar, bollywood, tollywood, movies, entertainment

Watch the official trailer of the film Total Dhamaal. It is an upcoming Hindi-language film directed and co-produced by Indra Kumar. It is an adventure comedy film which is the sequel to the 2011 film Double Dhamaal and the third installment of the Dhamaal film series.

గంటల వ్యవధిలోనే టోటల్ ధమాల్ సంచలనం..

Posted: 01/21/2019 05:15 PM IST
Total dhamaal official trailer wild wild best comedy

‘ధమాల్‌’ సిరీస్ లో వస్తోన్న మూడో చిత్రం ‘టోటల్‌ ధమాల్‌’ అన్ లైన్ లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. పదిహేడేళ్ల తర్వాత అనిల్ కపూర్‌, మాధురీ దీక్షిత్‌ కలసి నటిస్తున్న చిత్రం కావడం కూడా సంచలనానికి కారణం కాగా, అంతకుమించి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేయడంతో అది కాస్తా గంటల వ్యవధిలోనే ఐదు లక్షల వ్యూస్ దాటేసింది.

ఇందులో అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌, జానీ లీవర్‌, అర్షద్‌ వార్షి, జావేద్‌ జాఫ్రీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌, సంజయ్‌ మిశ్రా... ఇలా చిత్రంలోని కీలక నటులందరితో కూడిన ట్రైలర్ ప్రేక్షకులను కడుబుబ్బ నవ్విస్తుంది. ధమాల్, డబుల్ ధమాల్ సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం అద్యంతం వైల్డ్ లైప్ (వన్య మృగాల కాన్సెప్టు)తో అకట్టుకోనుంది.

‘ది వైల్డెస్ట్‌ అడ్వంచర్‌ ఎవ్వర్‌’ అని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన పోస్టర్ పై రాయడానికి అర్థం ట్రైలర్ తో స్పష్టమైంది. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 21న, సినిమాని వచ్చే నెల 22న విడుదల చేయనున్నారు. ఇందులో హాలీవుడ్‌ నుంచి తీసుకొచ్చిన క్రిస్టల్‌ అనే కోతి కూడా నటిస్తోంది.  ఇంతకుముందే అజయ్‌దేవగణ్‌తో క్రిస్టల్‌ ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Total Dhamaal  Ajay Devgn  Madhuri Dixit  Esha Gupta  Anil Kapoor  Indra Kumar  bollywood  

Other Articles